నిర్లక్ష్యంగా రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్.. వీడియో వైరల్

ప్రతి నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఈ తరుణంలో కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం అనేక సహసలు చేయడం, రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్, అలాగే రోడ్లపై కార్ రేస్ , బైక్ రేస్ అంటూ ఇలా విచిత్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

 A Video Of An Influencer Driving Rashly On The Roads Has Gone Viral, Rash Drving-TeluguStop.com

అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ ఫిట్నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ రజత్ దలాల్ ( Rajat Dalal )రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ తో అందరినీ భయాందోళనకు గురి చేశాడు.ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేసి పైగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న రజత్ దలాల్పై నెటిజన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.

ఢిల్లీలోని ఫరీదాబాద్ – బదర్‌పూర్ రోడ్డుపై ( Faridabad – Badarpur road in Delhi )ఏకంగా 143 కి.మీటర్ల వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీ కొట్టాడు.బైకును ఢీకొట్టగానే ఏం పర్లేదు.

అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ర్యాష్ డ్రైవింగ్ ను కొనసాగించాడు.ఈ క్రమంలో కార్లో అతని పక్కన కూర్చున్న ఒక అమ్మాయి కూడా అతనిని జాగ్రత్తగా డ్రై చేయమని సలహా ఇస్తున్నా.

ఇన్‌ఫ్లూయెన్సర్ రజత్ దలాల్ మాత్రం ఏం ప్రాబ్లం లేదు అంటూ ప్రతిస్పందించడం మనం వీడియోలో చూడవచ్చు.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పోలీసులు వెంటనే అతనికి తగిన గుణపాఠం చెప్పాలని కామెంట్ చేస్తున్నారు.

మరి కొందరేమో ఇలాంటి వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా.కచ్చితంగా జైల్లో ఉంచాలంటూ కామెంట్ చేస్తున్నారు.ఇకపోతే చాలామంది ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా వారి ప్రాణాలను డేంజర్ లో పెట్టడమే కాకుండా అమాయక ప్రజల ప్రాణాలు కూడా డేంజర్ లో పెట్టడం జరుగుతుంది.ఇలా అనేక ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube