సినిమా హీరోలు, హీరోయిన్లు మనీ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తూనే వివిధ ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు.
కొంతమంది సినీ సెలబ్రిటీలైతే సినిమాల్లో కంటే వేరే సోర్సెస్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తుంటారు.అలాంటి వారిలో అక్కినేని నాగచైతన్య ముందు వరుసలో నిలుస్తాడు.స్టార్ హీరోలు సాధారణంగా రూ.40 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటారు.మిడిల్ రేంజ్ హీరో అయిన నాగచైతన్య మాత్రం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు.మూవీ బడ్జెట్‌ను బట్టి తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుంటాడు.
నిజానికి నాగచైతన్య( Naga Chaitanya ) తక్కువ రేంజ్‌లోనే డబ్బులు తీసుకుంటున్నా సంపాదన విషయంలో మిగతా హీరోల కంటే వెనుక పడలేదు.హైదరాబాద్‌లో ప్రారంభించిన తన సొంత రెస్టారెంట్ వ్యాపారం ద్వారా చైతూ కోట్లు లాభాలు పొందుతున్నాడని సమాచారం.ఈ అక్కినేని హీరో హైటెక్ సిటీలోని కావూరి హిల్స్‌లో ‘షోయూ టేస్ట్ ఫుల్ ఏషియన్ డెలివెర్డ్( Shoyu Tasteful Asian Delivered )’ పేరిట ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు .ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లోనే టాప్ 10 పాపులర్ రెస్టారెంట్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.స్విగ్గీ యాప్‌లో ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు.
ఒకసారి స్విగ్గీ మెనూ చూస్తే ఇక్కడ అన్ని రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయో అని తెలుస్తుంది.విదేశీ ఫుడ్స్ సైతం అందుబాటులో ఉంటాయి.హైదరాబాద్ వాసులకు వివిధ దేశాల ఆహారాల రుచిని అందించాలనే ఉద్దేశంతోనే నాగచైతన్య దీన్ని ప్రారంభించాడు.చైతూ జస్ట్ సింగిల్డేలోనే ఈ రెస్టారెంట్ ద్వారా రూ.2-3 లక్షలు సంపాదిస్తాడట.వీకెండ్స్‌లో ఆ ఆదాయం రెట్టింపు అవుతుందని కూడా సమాచారం.అలా ఈ హీరో రెస్టారెంట్ వ్యాపారం ద్వారా నెలకి రూ.60 లక్షలు ఎర్న్ చేస్తున్నాడని తెలుస్తోంది.ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరానికి రూ.8-రూ.10 కోట్ల నాగ చైతన్య సంపాదిస్తున్నాడన్నమాట.చైతూ ఒక ఇయర్ వ్యవధిలో ఎక్కువ సినిమాలు చేయడు.రెమ్యునరేషన్(Remuneration ) కూడా సినిమా బడ్జెట్‌ను బట్టి తక్కువగా తీసుకుంటాడు.ఇలా చూసుకుంటే రెస్టారెంట్ వ్యాపారం ద్వారానే స్థిరంగా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు.అది కూడా ఆయన ఆ వ్యాపారంపై ఫుల్ టైమ్ వెచ్చించకుండానే మనీ సంపాదిస్తున్నాడు.
ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటితో కలిసి ‘తండేల్’ మూవీ( Thandel Movie ) చేస్తున్నాడు.రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో అల్లుఅరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.ఇది చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న సెకండ్ ఇది.