డబ్బులు ఎక్కువై ఈ సినిమాలు తీశారా.. వాటిని చూస్తే మతిపోతుంది..?

సాధారణంగా కొన్ని సినిమాలు చూస్తుంటే మనకు చాలా చిరాకు వచ్చేస్తుంది.కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశారు అని అనిపిస్తుంది.

 These Movies Wasted Lot Of Money , Son Of India, Mohan Babu, Breathe ,sachin Jos-TeluguStop.com

మరికొన్ని సినిమాలు మాత్రం ఏదో టైమ్‌పాస్‌కి, డబ్బులు ఖర్చు చేయడానికి ఏం తీసినట్లుగా అనిపిస్తుంది.అవి అంత చెత్తగా ఉంటాయి.

వాటికి ఒక ప్లానింగ్ అనేది ఏమీ ఉండదు.ఏదో తీసేద్దాం అన్నట్లు సినిమా తీసేస్తుంటారు.

అలాంటి కొన్ని సినిమాలు తెలుగులో విడుదలయ్యి ప్రేక్షకులను టార్చర్ చేశాయి.ఆ సినిమాలేవో తెలుసుకుందాం.

సన్నాఫ్ ఇండియా

Telugu Breathe, Mohan Babu, Neejathaga, Nikhil Gowda, Joshi, Son India, Tollywoo

మోహన్ బాబు హీరోగా మంచు విష్ణు దర్శకుడిగా తెరకెక్కిన సన్నాఫ్ ఇండియా( Son Of India ) మూవీ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లిన వారు తలలు బాదుకున్నారు. ఔట్‌డేటెడ్ స్టోరీ, వరస్ట్ డైరెక్షన్ దీనికి పెద్ద మైనస్ లు అయ్యాయి.ఎక్కువ డబ్బులు ఉండి వాటిని ఏం చేయాలో తెలియక ఈ సినిమా తీసారేమో అని ఒక ఫీల్ కూడా కలుగుతుంది.

బ్రీత్

Telugu Breathe, Mohan Babu, Neejathaga, Nikhil Gowda, Joshi, Son India, Tollywoo

నందమూరి చైతన్య కృష్ణ( Nandamuri Chaitanya Krishna ) హీరోగా వచ్చిన ఈ సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది.చైతన్య కృష్ణ సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడికి తనయుడు అవుతాడు.వైద్యో నారాయణో హరి అనే ఒక సబ్‌టైటిల్‌తో వచ్చిన ఈ మూవీని వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేశాడు.వైదిక సెంజలియా, వెన్నెల కిశోర్‌, భద్రం, జబర్దస్త్ అప్పారావు లాంటి ప్రముఖులు కూడా ఇందులో నటించారు.

కానీ కథ బాగోపోవడంతో ఈ మూవీ పెద్దగా ఆడలేదు.ఈ సినిమా డబ్బులు ఎక్కువై తీశారా అనే ఒక అభిప్రాయం కూడా ప్రేక్షకుల్లో ఏర్పడింది.

ఎందుకంటే ఇది అంత చెత్తగా ఉంది.ఇందులో మెడికల్ మాఫియాను కథా వస్తువుగా తీసుకున్నారు.డైరెక్టర్ ఎలాంటివి ట్విస్టులు లేకుండా, చాలా బోరింగ్ నేరేటివ్ తో చిరాకు పుట్టించాడు.

జాగ్వార్

2016లో విడుదలైన విజిలెంట్ యాక్షన్ మూవీ “జాగ్వార్( Jaguar )” నిఖిల్ కుమారస్వామి హీరోగా నటించాడు.నీ తన తండ్రి ప్రొడ్యూస్ చేశారు.నిఖిల్‌కు HD దేవెగౌడ తాత, ప్రజ్వల్ రేవణ్ణ కజిన్ అవుతారు.ఇది కన్నడ, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది ఇందులో రమ్యకృష్ణ, జగపతిబాబు లాంటి స్టార్ యాక్టర్స్ కూడా నటించారు.కానీ ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.దీన్ని ఎందుకు తీసారో కూడా ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారు.

నీ జతగా నేనుండాలి

Telugu Breathe, Mohan Babu, Neejathaga, Nikhil Gowda, Joshi, Son India, Tollywoo

ఆషికీ 2 చిత్రానికి అధికారిక రీమేక్‌గా వచ్చిన “నీ జతగా నేనుండాలి( Nee Jathaga Nenundali )” సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది.జయ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో సచిన్ జె జోషి హీరోగా నటించాడు.సచిన్ చాలా రిచ్ పర్సన్ అందువల్ల ఆల్రెడీ అందరూ చూసేసిన బ్లాక్‌బస్టర్ హిట్ ఆషికీ 2కి రీమేక్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube