వర్షా కాలంలో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో నేరేడు ( Jamun fruit )ఒకటి.ఈ సీజనల్ ఫ్రూట్ చాలా మందికి ఫేవరెట్ అని చెప్పుకోవాలి.
ఈ సీజన్ లో మాత్రమే దొరికే నేరేడు పండులో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, మెగ్నీషియం తదితర పోషకాలు నేరేడు పండ్ల ద్వారా పొందవచ్చు.
వర్షాకాలంలో ఆరోగ్యానికి నేరేడు పండ్లు అండగా ఉంటాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా నేరేడు పండ్లను తీసుకుంటే ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా ఆరు నుంచి ఎనిమిది ఫ్రెష్ నేరేడు పండ్లను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న నేరేడు పండు ముక్కలు వేసుకోవాలి.అలాగే హాఫ్ బనానాతో పాటు ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.,/br>
తద్వారా మంచి స్మూతీ సిద్ధమవుతుంది.ఈ స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి తీసుకోవాలి.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే హెల్త్ పరంగా చాలా లాభాలు పొందవచ్చు.
ముఖ్యంగా ఈ స్మూతీ రోగ నిరోధక వ్యవస్థను( Immune system ) సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తుంది.సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అంటుకుంటుంది.నేరేడు పండ్లలో తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉన్నందున.ఈ స్మూతీ వెయిట్ లాస్ ( Weight loss )కు గ్రేట్ గా సహాయపడుతుంది.
ఈ స్మూతీ చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి వాటిని దూరం చేస్తుంది.శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది.
వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి సమస్యల నుంచి విముక్తి అందిస్తుంది.ఈ స్మూతీ నీరసం, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తి ఇస్తుంది.
మరియు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు.