సరిపోలేదు నాని... విలన్ సూర్య చాలా బెటర్ నీ కన్నా కూడా..!

రాజమౌళి సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు ఎంత బలంగా ఉంటాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.విలన్ రోల్( Villain Role ) బలంగా ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడు.

 Facts About Nani Saripodhaa Sanivaaram Movie Details, Nani ,saripodhaa Sanivaar-TeluguStop.com

సినిమా రసవత్తరంగా సాగుతుంది.విలన్ మామూలోడు అయితే మూవీ సాదాసీదాగా సాగిపోతుంది.

అలాగని విలనే హీరో కంటే మరింత స్ట్రాంగ్ అని చూపించి, అతడి పాత్రే మూవీని ఎక్కువగా డామినేట్ చేసే లాగా సినిమాలు తీయరు.ముఖ్యంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోకి అతీత శక్తులు ఉన్నట్లుగా చూపిస్తారు.

విలన్ కండలు తిరిగి ఉన్నా సరే అతన్ని చిన్న పిల్లవాడి కంటే బలహీనంగా చూపిస్తారు.ఫ్యాన్స్ కోసం ఇలా సినిమాలు తీస్తుంటారు.

హీరోలు కూడా తమ క్యారెక్టర్ బలంగా ఉండాలని భావిస్తారు.

Telugu Vivek Athreya, Nani, Nanisaripodhaa, Priyanka Mohan, Sjsurya, Sj Surya, T

కానీ హీరో నాని( Nani ) మాత్రం విలన్ రోల్ తన పాత్రను డామినేట్ చేస్తుందని తెలిసినా సినిమాని చేయడానికి ఒప్పుకున్నాడు.ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ టైమ్‌లో ఫుల్ హైప్‌ క్రియేట్ చేసిన “సరిపోదా శనివారం”.( Saripodhaa Sanivaaram ) తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీలో విలన్‌ ఎస్‌జే సూర్య( SJ Surya ) కొన్నిచోట్ల నానిని పూర్తిగా డామినేట్ చేశాడు.

అలాంటి సీన్లు ఏ హీరో కూడా ఒప్పుకోడు కానీ నాని ఒప్పుకొని తన గొప్పతనాన్ని చూపించాడు.విలన్ పాత్ర మరి ఇంత స్ట్రాంగ్ గా ఉంటే నాకు ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది అని వేరే హీరో అయితే అడిగి ఉండేవాళ్లు కానీ నాని అలా అడగలేదు.

నాని, సూర్య క్యారెక్టర్లు చాలా బాగా డిజైన్ చేశారు.వారి పర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది.వాళ్ల కారణంగానే ఈ సినిమా ఒక్కసారైనా చూడవచ్చు.క్రూరుడైన విలన్ పాత్రలో సూర్య మంచిగా నటించాడు కానీ మాస్ యాక్షన్ రోల్లో నాని సరిగ్గా సూట్ అవ్వలేదు.

కానీ వారి పాత్ర మేరకు వాళ్ళు బాగానే నటించారు.

Telugu Vivek Athreya, Nani, Nanisaripodhaa, Priyanka Mohan, Sjsurya, Sj Surya, T

ఇందులో జేక్స్ బెజోయ్ బీజీఎం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.కొన్ని చోట్ల చెవులకు చిల్లులు పడేలాగా అనవసరంగా బీజీఎమ్ అందించాడు కానీ మిగతా చోట్ల బీజీఎమ్ బాగుంటుంది.దర్శకుడు వివేక్ ఆత్రేయ( Vivek Athreya ) ఈ సినిమాకి “సరిపోదా శనివారం” అని ఒక వెరైటీ టైటిల్ పెట్టాడు.

దానికి తగినట్లే స్టోరీలైన్‌ ఉంటుంది.మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన “శనివారం నాది” అనే ఒక నవల ఆధారంగా ఈ మూవీ తీసినట్లుగా ప్రచారం కూడా జరిగింది.

బహుశా ఆ మూవీలోని ఒక పాయింట్ తీసుకొని ఈ దర్శకుడు సినిమా తీసి ఉండొచ్చు.ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో థియేటర్లలో ఆడుతున్న సినిమాలు కలెక్షన్లు రాబట్ట లేకపోతున్నాయి.

ఈ సమయంలో రిలీజ్ అయిన సరిపోదా శనివారం మూవీ విడుదల అయింది కదా చాలా బాగుంది ఉంటే భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చి ఉండేవి కానీ ఈ మూవీ యావరేజ్ గానే ఉంది కాబట్టి నిరాశ తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube