ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ, బీఆర్ఎస్( YCP, BRS ) పార్టీలు ఇప్పుడు దాదాపు ఒకే రకమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి.పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కీలక నేతలు అనుకున్న వారు ఎందరో పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరిపోవడం వంటివి సర్వసాధారణం అయిపోయాయి.
ముందుగా బీఆర్ఎస్ గురించి చర్చించుకుంటే వరుసగా రెండు సార్లు తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, మూడోసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలవ్వడం తో అప్పటి నుంచి వరుసగా కష్టాలు మొదలయ్యాయి.వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడంతో జనాల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత బీ ఆర్ ఎస్ ను ఓటమిపాలు చేసింది.
కాకపోతే అంత ఘోరంగా అయితే ఓటమి చెందలేదు.బీఆర్ఎస్ ఓటమి చెందిన వెంటనే కేసీఆర్ ( KCR )కు అత్యంత నమ్మకస్తులుగా పేరుపొందిన వారే ముందుగా పార్టీని వీడి వెళ్ళారు.

పట్నం మహేందర్ రెడ్డి , దానం నాగేందర్, కడియం శ్రీహరి( Patnam Mahender Reddy, Danam Nagender, Kadiam Srihari ), ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది కీలక నాయకులే పార్టీని వీడి కేసీఆర్ నమ్మకం పై దెబ్బకొట్టారు.ఇంకా ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇక వైసీపీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ మాదిరిగానే వైసీపీ కూడా ఏపీలో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోంది.2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలో కి వచ్చి 5 ఏళ్ల పాటు తన పాలన ను జనాలకు చూపించారు.కానీ రెండో సారి మాత్రం ఆ పార్టీకి జనాలు ఛాన్స్ ఇవ్వలేదు.

2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది.ఇక అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.జగన్ బంధువులు, అత్యంత సన్నిహితులు గా గుర్తింపు పొందిన వారు మొదటి నుంచి జగన్ వెంట నడిచిన ఎంతో మంది వైసీపీని వీడి వెళ్లిపోయారు.
మాజీ మంత్రి ఆళ్ళ నాని వంటి వారు పార్టీకి రాజీనామా చేయడం జగన్ కు పెద్ద షాకే ఇచ్చింది.ప్రస్తుతం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వంటి వారు వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఇంకా అనేకమంది నేతలు ఆ బాటలోనే ఉండడంతో ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని టెన్షన్ ఆ పార్టీలో నెలకొంది.