వైరల్ వీడియో: దొంగతనం కేసులో దారుణంగా ప్రవర్తించిన పోలీసులు..

ప్రస్తుత రోజులలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎవరు ప్రశ్నించలేని పరిస్థితుల రోజులలో మనం ఉన్నాం.ప్రస్తుత సమాజంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదు అన్నట్లు ఉంది.

 Grp Police Brutally Beat Up Grandma Grandson In Mps Katni Viral Video Details, G-TeluguStop.com

దేశం అంతటా ఎక్కడ చూసినా కూడా ఎన్నో దారుణాలు జరుగుతూనే ఉంటాయి.ఇందుకు సంబంధించిన వివరాలు రోజుకొక కోణంలో వెలుగులోకి వస్తుంటాయి.

అయితే, తాజాగా మధ్యప్రదేశ్ లో( Madhya Pradesh ) ఒక మహిళను, ఓ మైనర్ బాలుడిని పోలీసులు చితక్కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.దొంగతనం( Theft ) చేశారన్న అనుమానంతో ఒక మహిళా పోలీస్ వారి ఇద్దరిని దారుణంగా కొడుతుండడం మనం చూడవచ్చు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.మధ్యప్రదేశ్ లోని కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ, తన మనవడు ఇద్దరూ కలిసి దొంగతనం చేశారన్న అనుమానంతో ఒక మహిళా పోలీస్ ముందుగా ఆమె ఆఫీస్ రూమును తలుపులు మూసేసి ఆ మహిళను కర్రతో చాలాసార్లు కొట్టింది.ఈ క్రమంలో బాధిత మహిళ వెంటనే నేలపై పడిపోవడంతో, ఆ మహిళ పోలీస్ మైనర్ బాలుడిని కూడా కొట్టారు.ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో ప్రజలు పోలీసులపై( Police ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ఎంపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.మధ్యప్రదేశ్‌లో ఏమి జరుగుతుందో చెప్పడానికి మీ దెగ్గర సమాధానం ఉందా.? శాంతిభద్రతల పేరుతో గూండాయిజం చేస్తూ మనుషులను చంపేందుకు మీ పోలీసులు పూనుకున్నారు.కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దళిత కుటుంబానికి చెందిన 15 ఏళ్ల పిల్లాడిని, అతని అమ్మమను స్టేషన్‌ ఇన్‌చార్జి, పోలీసులు చేసిన దారుణం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఇంత ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న.మీ ఉదాసీనత వల్లనా.? లేక ఇలాంటి చర్యలకు ఏమైనా అనుమతి ఇచ్చారా.? అంటూ రాసుకొచ్చారు.ఈ వీడియో చూసిన నెటిజన్స్ విషయం సరిగ్గా తెలియకుండా ఇలా కొట్టడం దారుణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube