లావుగా ఉన్నామని దిగులొద్దు.. సింపుల్ గా సన్నబడండిలా!

ఇటీవల రోజుల్లో అధిక బరువు( Over Weight ) అనేది కోట్లాది మందికి అతిపెద్ద శత్రువు గా మారిపోయింది.లావుగా ఉన్నామని ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

 Follow These Simple Tips To Lose Weight Details, Simple Tips, Weight Loss, Weig-TeluguStop.com

కొందరు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతున్నారు.కానీ దిగులొద్దు.

బరువు పెరగడానికి అందరిలో ఒకే రకమైన కారణాలు ఉండవు.ఆహారపు అలవాట్లు, పలు దీర్ఘకాలిక వ్యాధులు, శరీరానికి శ్రమ లేకపోవడం, మద్యపానం అలవాటు తదితర అంశాలు బరువు పెరగడానికి కారణం అవుతుంటాయి.

అలాగే బరువు తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ఈ నేప‌థ్యంలోనే సింపుల్ గా సన్నబడటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసి దోర‌గా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్లు వాము మరియు రెండు టేబుల్ స్పూన్లు నల్ల జీలకర్ర( Black Cumin ) కూడా వేసుకుని వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించి చల్లార బెట్టుకున్న మెంతులు, వాము, నల్ల జీలకర్ర వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి.

Telugu Fat Cutter, Fenugreek Seed, Tips, Simple Tips, Powder-Telugu Health

ఈ పొడిని ఒక బాక్స్ లో భద్రపరచుకోవాలి.రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడి కలిపి సేవించాలి.రోజు ఈ విధంగా చేయడం వల్ల మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

శరీరంలో అదనపు కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.లావుగా ఉన్నవారు క్రమంగా సన్నబడతారు.

Telugu Fat Cutter, Fenugreek Seed, Tips, Simple Tips, Powder-Telugu Health

అలాగే ఈ పొడిని తీసుకోవడంతో పాటు నిత్యం అరగంట పాటు ఏదో ఒక వ్యాయామం( Exercise ) చేయాలి.అధిక కొవ్వు ఆహారాలకు, బ‌య‌ట ఆహారాల‌కు దూరంగా ఉండాలి.డైట్ లో తాజా కూరగాయలు, ఆకుకూరలు, సీజనల్ పండ్లు, నట్స్, సీడ్స్, మొలకెత్తిన విత్తనాలు, తృణ‌ధాన్యాలను డైట్ లో చేర్చుకోవాలి.కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండాలి.తద్వారా శ‌రీర బ‌రువు అదుపులోకి వ‌స్తుంది.

క్ర‌మంగా స‌న్న‌బ‌డ‌తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube