బీసీ గురుకులంలో విద్యార్థులపై ఎలుకల దాడి

నల్లగొండ జిల్లా: దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో గత సోమవారం నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.విశ్వసనీయ సమాచారం ప్రకారం… సోమవారం రాత్రి విద్యార్థులు నిర్దిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎలుకలు దాడి చేసి 13 మందిని గాయపర్చినట్లు తెలుస్తోంది.

 Rats Attack Students In Bc Gurukulam,rats Attack, Students ,bc Gurukulam, Nalgon-TeluguStop.com

దీనితో అప్రమత్తమైన ఉపాధ్యాయులు తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు చికిత్స చేయించి, విషయాన్ని బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో రెండు రోజుల తర్వాత పేరెంట్స్ కు తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీసీ గురుకుల పాఠశాల అపరిశుభ్రంగా ఉండడంతోనే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని,ఎలుకల కోసం పాములు కూడా వచ్చే అవకాశం ఉంటుందని,చదువు కోసం మా పిల్లలను పంపిస్తే ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈఘటనపై తెలుసుకునేందుకు పాఠశాల ప్రిన్సిపాల్ కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా గురుకులంలో ఏం జరిగిందో విచారణ జరిపి, పాఠశాలలో అన్నిరకాల వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని,ఈ పరిస్థితికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube