ఒకప్పుడు ప్రజల దాహం తీర్చిన నీటి ట్యాంక్...!

నల్లగొండ జిల్లా: గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 20 ఏళ్ల క్రితం నీటి ట్యాంకును నిర్మించారు.కానీ,ప్రస్తుతం ప్రతి ఇంటికి కృష్ణా నీటిని సరఫరా చేస్తుండడంతో నీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది.

 A Water Tank That Once Quenched Peoples Thirst, Water Tank , Peoples Thirst, Nal-TeluguStop.com

అప్పుడు గ్రామంగా ఉన్న గట్టుప్పల్ ఈ మధ్య కాలంలో కొత్త మండలకేంద్రంగా ఏర్పాటై వాహనాల రద్దీ పెరిగింది.

వృథాగా ఉన్న నీటి ట్యాంకు పక్కనే పెట్రోల్ బంక్ రావడంతో ఒకవైపు నుండి వచ్చే వాహనాలకు మరోవైపు వాహనాలు కనిపించకుండా అడ్డుగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదకరంగా మారిన ఈ నీటి ట్యాంకును తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని,రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారిన ఈ నీటి ట్యాంకును వెంటనే తొలగించాలని వాహనదారులు,స్థానికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube