ఈ సూప్ డైట్ లో ఉంటే లంగ్స్ శుభ్రంగా మారడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం!

ఇటీవల కాలంలో లంగ్స్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ధూమపానం, కాలుష్యం, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలు.

 A Healthy Soup That Cleans The Lungs Is For You! Healthy Soup, Soup, Lungs, Heal-TeluguStop.com

లంగ్స్ ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం.ఒకవేళ‌ మన లంగ్స్ లో కాలుష్య కారకాలు పేరుకుపోయి వాటి ఆరోగ్యం దెబ్బ తింటే శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలన్నీ చుట్టుముట్టేస్తాయి.అందుకే ఎప్పటికప్పుడు లంగ్స్ ను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.వాటిలో ఇప్పుడు చెప్పబోయే సూప్ కూడా ఒకటి.

ఈ సూప్ ను డైట్ లో కనుక చేర్చుకుంటే లంగ్స్ శుభ్రంగా మారడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం లంగ్స్ ను శుభ్రంగా మార్చే ఆ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Healthy Lungs, Healthy Soup, Latest, Lungs, Lungs Soup, Soup-Telugu

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండున్నర గ్లాసుల వాటర్ ను వేసుకోవాలి.వాటర్ బాగా మరిగిన తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు బీట్ రూట్ ముక్కలు, అర కప్పు తరిగిన ఫ్రెష్ పాలకూర, రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము ముక్కలు, అర కప్పు టొమాటో ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలిపి ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన ముక్కలను చల్లార పెట్టుకోవాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత ఉడికించిన ముక్కలను వాట‌ర్ తో సహా బ్లెండర్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే మన సూప్‌ సిద్ధమవుతుంది.ఈ హెల్తీ సూప్ ను డిన్నర్ లో లేదా లంచ్ లో తీసుకోవచ్చు.

ఈ సూప్ ను తీసుకోవడం వల్ల లంగ్స్ లో పేరుకుపోయిన కాలుష్య కారకాలు, వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.లంగ్స్ శుభ్రంగా మరియు ఆరోగ్యంగా మారతాయి.

అంతేకాదు ఈ సూప్‌ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.వెయిట్ లాస్ అవుతారు.

రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.మెదడు మునపటి కంటే వేగంగా చురుగ్గా పనిచేస్తుంది.

మరియు చర్మం నవ యవ్వనంగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube