సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రత్యేక గుర్తింపును సాధించుకోవడానికి హీరోలుగా అహర్నిశలు కష్టపడుతూ ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే.అయితే వాళ్లకు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు అలా ఇండస్ట్రీలో సినిమా హీరోలుగా వచ్చి ఇండస్ట్రీలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు జరిగింది.
అయితే ఇదంత సినిమా అనేది ఉండటం వల్లే హీరోలు వచ్చారు అని మనకు తెలుసు అయితే ఇండియన్ సినిమా చరిత్రలో మొదట గా సినిమా ఎవరు తీశారు సినిమా అనేది ఒకటి ఉంటుంది అని ఎవరు కనుక్కున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
అసలు సినిమా అనేది భారతదేశ చరిత్రలో ఇలా మొదలైంది అనే విషయం చాలా మందికి తెలియదు అయితే సినిమాకు సంబంధించిన స్టోరీ, డైరెక్షన్, కాస్టింగ్, కొరియోగ్రఫీ లాంటి అన్ని విభాగాలను చూసుకుంటూ సినిమా అనేదాన్ని భారతదేశ చరిత్రకు పరిచయం చేసిన ఒక్కగానొక్క వ్యక్తి దాదాసాహెబ్.సినిమా తీసి జనాలకి సినిమా అంటే ఇలా ఉంటుంది అని చూపించారు.
అయితే ఆయనకు సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే 1911 వ సంవత్సరంలో తన భార్యతో కలిసి క్రిస్మస్ పండుగ రోజు టెంట్లో ఒక ఇంగ్లీష్ సినిమా ని ప్లే చేశారు.ఆ సినిమా యేసు క్రీస్తు కు సంబంధించిన సినిమా అయితే సినిమా చూసిన చాలా మంది ఆడియన్స్ భావోద్వేగానికి గురై అక్కడ చూపించేది అబద్ధం అని తెలిసిన కూడా కళ్ల నుంచి నీరు కారడం గమనించిన దాదాసాహెబ్ అతని భార్య తో మనం కూడా ఒక సినిమా తీయాలి అని చెప్పి దానికి అనుకూలమైన కెమెరాని స్టోరీని రెడీ చేసుకుని సినిమా తీయడానికి సిద్ధమయ్యారు.

ఆయన తీసిన సినిమా ఏంటంటే రాజా హరిశ్చంద్ర సినిమా ముంబై లో ప్లే చేసారు అక్కడ మంచిగా ఆడి జనాలు అందరిని ఆకర్షించింది అలా ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాగా రాజా హరిచంద్ర చరిత్ర లోకి ఎక్కింది అయితే ఆ తర్వాత నుంచి భారతదేశ చరిత్రలోనే సినిమా అంటే ఏంటి దాన్ని ఎలా తీయాలి అనే దాని మీద చాలామంది అవగాహన కల్పించుకుని అప్పటినుంచి సినిమాలు తీయడం మొదలు పెట్టారు.కానీ ఇండియాలో మొదటి సినిమా తీసిన దాదాసాహెబ్ పేరుమీదుగా ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో వాళ్ల సేవలను ఎక్కువగా అందిస్తారో వాళ్లకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది.

తెలుగులో ప్రొడ్యూసర్ గా తనదైన సేవలను అందించిన డాక్టర్ డి.రామానాయుడు గారికి ఫాల్కే అవార్డును ఇచ్చి సత్కరించారు అలాగే అక్కినేని నాగేశ్వర రావు గారికి కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇచ్చారు ఎందుకంటే అప్పట్లో నాగేశ్వరావు మంచి సినిమా నుంచి జనాలు అందరిని ఆకట్టుకున్నాడు కాబట్టి తన కృషికి ఇండస్ట్రీకి తన సేవలను అందించినందుకు గాను ఆయనకు కూడా ఈ అవార్డును ఇచ్చి సత్కరించడం జరిగినది.ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే సౌత్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన రజనీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చి గౌరవించారు రజనీకాంత్ సినిమా హీరోగా తన కృషితో ఎదిగిన వ్యక్తి గా మనందరికీ తెలుసు తను సినిమా రంగానికి అందించిన సేవలకు గాను అతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వడం అనేది మంచి నిర్ణయం అని చాలామంది ఫ్యాన్స్ ప్రేక్షకులు కూడా వాళ్ల అభిప్రాయం వ్యక్తం చేశారు…
కానీ భారతదేశ చరిత్రలో మొదటిసారిగా సినిమాలు తీసిన దాదాసాహెబ్ ఫాల్కే గురించి ఈ జనరేషన్ లో ఉన్న యూత్ కి సరిగ్గా తెలియక పోవడం అనేది కొంతవరకు బాధ కలిగించే విషయం అనే చెప్పాలి…