టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెజీనా కసాండ్రా తెలుగులో పలు సినిమాల ద్వారా సందడి చేసినప్పటికీ ప్రస్తుతం ఈమెకు ఎలాంటి అవకాశాలు లేవు.ఈ క్రమంలోనే తమిళనాట వరుస సినిమాలను దక్కించుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు.
రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే.ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.
తాజాగా రెజీనాకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజమౌళి దర్శకత్వం వహించిన “ఛత్రపతి” సినిమా బాలీవుడ్ రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
ఇప్పటికే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతో మంది బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి.కానీ గత రెండు రోజుల నుంచి బాలీవుడ్ ఛత్రపతి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ రెజీనా నటిస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా ఈ విషయమై ఛత్రపతి టీమ్ స్పందిస్తూ.గత రెండు రోజుల నుంచి చత్రపతి సినిమా హీరోయిన్ రెజీనా అంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్ గా చేయటం కోసం ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా రీమేక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించడం కోసం బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.మరి బెల్లంకొండ శ్రీనివాస్ తో ఎవరు జోడి కడతారనే విషయం తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఈ సినిమాకు వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.