1.రేవంత్ రెడ్డి అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల సంఘటనలో మరణించిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నర్సంపేట కు వెళ్తుండగా ఘట్కేసర్ వద్ద పోలీసులు అడ్డుకుని ఆయనను అరెస్టు చేశారు.
2.లోన్ రికవరీ ఏజెంట్ లకు ఆర్బీఐ వార్నింగ్
అప్పులు వసూలు చేయడానికి కొన్ని బ్యాంకులు వేధించడం, బెదిరించడం వంటి పద్ధతులను వాడటం పై ఆర్బిఐ తీవ్రంగా స్పందించింది.కస్టమర్లను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు.
3.అనంత బాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబుకు రాజమండ్రి ఎస్సీ , ఎస్టీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
4.సికింద్రాబాద్ లో పలు రైళ్లు రద్దు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నేడు, రేపు 22 రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
5.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.రేపు జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్ని పథకం కి వ్యతిరేకంగా ఆర్మీ ఉద్యోగాలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షకు దిగనుంది.
7.సికింద్రాబాద్ అల్లర్లు.12 కోట్ల ఆస్తి నష్టం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న ఆర్మీ అభ్యర్థులు జరిపిన దాడుల్లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 12 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా తెలిపారు.
8.ఐదవ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన ఐదో రోజుకు చేరింది.
9.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బెస్ట్ స్క్రై ట్రాక్స్ అవార్డు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్ స్క్రై ట్రాక్స్ అవార్డు దక్కిందని జిఎంఆర్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
10.అగ్నిపథ్ ను పునః సమీక్షించాలి
వివాదాస్పద అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం పునః సమీక్షించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
11.తెలంగాణ చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఉజ్జల్ భూయాన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
12.తెలంగాణలో కరోనా
24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.ఆనకట్టల రక్షణకు కమిటీలు
తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులక రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆనకట్టల రక్షణ కమిటీలను నియమించింది.
14.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని బర్తరఫ్ చేయాలి
చిత్తూరు జిల్లా పుంగనూరు లో ఉద్రిక్తత కొనసాగుతోంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని బర్తరఫ్ చేయాలంటూ నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు.
15. నెల్లూరులో ఎలుగు బంట్లు సంచారం
నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం పి ఎం పల్లి గ్రామస్తులకు ఎలుగుబంట్లు దడ పుట్టిస్తున్నాయి.రాత్రంతా చెరువు సమీపంలో తిరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
16.అగ్నిపథ్ పథకంపై రాజ్ నాథ్ సింగ్ సమీక్ష
అగ్నిపత్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పథకం పై ఈ రోజు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించనున్నారు.
17.ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ఈరోజు రేపు హైదరాబాదులో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నారు.
18.ఏపీలో పాలిసెట్ ఫలితాలు విడుదల
ఏపీ లో ఈ రోజు పాలిసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.
19.బీహార్ లో 12 జిల్లాల్లో ఇంటర్ నెట్ బంద్
అగ్నిపథ్ పై ఆందోళనలు విధ్వంసాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బీహార్ లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు బంద్ చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,650 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,980
.