పొట్ట కొవ్వును కరిగించే కాఫీ.. ఎలా తీసుకోవాలంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎందరో కాఫీ( Coffee ) ప్రియులు ఉన్నారు.ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగడం వల్ల వచ్చే మజా అంతా ఇంతా కాదు.

 How To Take Coffee For Belly Fat Melting , Coffee, Black Coffee, Latest News, He-TeluguStop.com

ఎలాంటి మూడ్ అయినా ఇట్టే చేంజ్ అవుతుంది.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.

అందుకే చాలా మంది తమ ఉదయాన్ని కాఫీ తో ప్రారంభిస్తూ ఉంటారు.కాఫీని లిమిట్ గా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఇప్పటికే ప‌లు అధ్యయనాల్లో తేలింది.

పైగా కాఫీ వల్ల ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు.

అయితే పొట్ట కొవ్వును కరిగించడానికి కూడా కాఫీ పౌడర్ ఉత్తమంగా సహాయపడుతుంది.అందుకోసం కాఫీని ఎలా తీసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అంగుళం దాల్చిన చెక్క,( cinnamon ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో కాఫీ ఫిల్టర్ చేసుకోవాలి.ఈ బ్లాక్ కాఫీలో కొద్దిగా తేనెను( honey ) మిక్స్ చేసి సేవించాలి.ఈ విధంగా కాఫీ తీసుకుంటే ఎలాంటి బాన పొట్ట అయినా కొద్ది రోజుల్లో కరిగిపోతుంది.బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఈ బ్లాక్ కాఫీ ఉత్తమంగా సహాయపడుతుంది.

అలాగే ఈ బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో వేగంగా క్యాలరీలు కరుగుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

అంతేకాదు ఈ బ్లాక్ కాఫీని డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మధుమేహానికి దూరంగా ఉండవచ్చు.లివర్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.

రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటారు.డిప్రెషన్ నుంచి బయటపడడానికి బ్లాక్ కాఫీ ఉత్తమమైన ఎంపిక.

అలాగే బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెదడు మరింత వేగంగా పని చేస్తుంది.జ్ఞాపకశక్తి ఆలోచన శక్తి సైతం రెట్టింపు అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube