గత కొన్ని నెలలుగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
అయితే శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న కీలక విషయాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.ఎక్కువ బరువు ఉన్నవాళ్లు కరోనా బారిన పడితే మరణం ముప్పు పెరుగుతుందని… మరణం ముప్పు 48 శాతం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచ బ్యాంక్ కరోనా వైరస్ గురించి అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని నియమించింది.ఊబకాయం సమస్యతో బాధ పడే వారు 113 శాతం ఎక్కువగా వైరస్ బారిన పడతారని నిపుణులు తెలిపారు.
ఈ నిపుణుల కమిటీలో ఏకంగా 74 శాతం మందికి ఆక్సిజన్ వెంటిలేటర్లతో అవసరం ఉంది.నిపుణులు మధుమేహం సమస్యతో బాధ పడే వారు వైరస్ బారిన పడితే మరింత ప్రమాదం అని సూచిస్తున్నారు.
రక్తంలో గ్లూకోజ్ లెవెల్ పెరిగితే రక్తం గడ్డ కడుతుందని వీరిలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.ఊబకాయంతో బాధ పడేవారు వెంటిలేటర్ సహాయంతో చికిత్స చేసినా కోలుకునే అవకాశాలు తక్కువని శాస్త్రవేత్తలు నిపుణులు తెలిపారు.
వీరికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినా వ్యాక్సిన్ వీరిపై ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అమెరికా, బ్రిటన్ దేశాలలో అధిక బరువు ఉన్నవారు ఎక్కువమంది ఉన్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.