బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్( Kangana Ranaut ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కంగానా.తరచూ సోషల్ మీడియాలో ఎవరివో ఒకరిపై సంచలన ట్వీట్ చేయడం, సంచలన వ్యాఖ్యలు చేయడం లాంటివి చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 18 ఏళ్ళు పూర్తి అవుతోంది.ఇప్పటివరకు ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి మెప్పించింది.
కాగా కంగానా స్వీయ దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం ఎమర్జెన్సీ( Emergency ).ఈ సినిమా సెప్టెంబర్ ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా కంగానా ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరియర్ ను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నటిని కావాలనే ఆశతో 2004లో ముంబయి వచ్చాను.2005 06లో గ్యాంగ్‌స్టర్, వోహ లమ్హే వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాను.మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్‌స్టర్ వంటి ఎన్నో పాత్రలు పోషించాను.
నా నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి.
పొగడ్తలు పక్కన పెడితే దాదాపు దశాబ్దకాలం పాటు నాకు వర్క్ దొరకలేదు.ఆఫర్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను.దేశమే నన్ను బహిష్కరించిందనిపించింది.
విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నాను అని చెప్పుకొచ్చింది కంగానా.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అనంతరం యాంకర్ నటి లేదా దర్శకురాలిగా ఏ వర్క్ చేయడం కష్టంగా అనిపించింది అని ప్రశ్నించగా.నటిగా వర్క్ చేయడం నాకు ఏమాత్రం కష్టం కాదు.
అది నాకు చాలా సులభమైన విషయం.
కానీ, నటిగానే కొనసాగడం నాకు నచ్చదు.ఎందుకంటే దానికి పలు కారణాలు ఉన్నాయి.సెట్‌కు సంబంధించి పూర్తి సమాచారం మన వద్ద ఉండదు.
దర్శకురాలిగా ఉండటం నాకెంతో ఇష్టం.సెట్లో ఏం జరుగుతుంది? అని అడిగితే తప్పకుండా నేను చెప్పగలను.నాకు పూర్తి అవగాహన ఉంటుంది.నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో నేనూ ఒకదాన్ని అనుకుంటున్నా.సెట్స్‌లో నాకు నటీనటులంటేనే ఎక్కువ గౌరవం.వారిని జాగ్రత్తగా చూసుకుంటా.
ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు వారికి తెలియజేస్తాను అని కంగానా తెలిపింది.