వచ్చే నెల 30వ తేదీ లోగా సీఎంఆర్ ఇవ్వాలి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్..

రాజన్న సిరిసిల్ల జిల్లా: రైస్ మిల్లర్లు 2023-24 సీజన్ ఖరీఫ్ సీఎంఆర్( Kharif CMR) ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Additional Collector Khemya Naik) ఆదేశించారు.ముస్తాబాద్ లోని తిరుమల, శ్రీనివాస, నామాపూర్లోని ధన లక్ష్మి, సప్తగిరి, పోత్గల్ లోని బాలాజీ రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Additional Collector Khemya Naik Should Give Cmr By 30th Of Next Month., Additio-TeluguStop.com

రైస్ మిల్లుల్లో మిల్లింగ్, బియ్యం నాణ్యతను పరిశీలించారు. సీఎంఆర్ లక్ష్యం ఎక్కడి వరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు.

అన్ని రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30 వ తేదీలోగా ఇవ్వాలని సూచించారు.డేట్ మళ్ళీ పోడగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రజిత తదితరులు ఉన్నారు.

రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తి చేయాలితహసిల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.ముస్తాబాద్ తహసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సిబ్బంది హాజరు రిజిస్టర్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఆఫీస్ ఆవరణ పరిశీలించారు.కార్యాలయాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తహసీల్దార్ సురేష్ కు సూచించారు.

మీ సేవా దరఖాస్తులు, ధరణి పెండింగ్ అప్లికేషన్స్ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం పలువురు రైతులతో మాట్లాడారు.

కేజీబీవీ విద్యాలయం తనిఖీముస్తాబాద్ మండల( Mustabad mandal ) కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులకు అందిస్తున్న  ఆహార పదార్థాలు నాణ్యత ఎలా ఉందో చూసి విద్యార్థులతో మాట్లాడారు.

ఆఫీస్ రూమ్ లో రిజిస్టర్లు, స్టోర్ రూమ్ లో నిల్వచేసిన బియ్యం, ఆహార పదార్థాల తయారీ వినియోగించే వస్తువులను పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube