హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ కు చెక్ పెట్టే మ్యాజికల్ ఆయిల్ ఇది.. తప్పకుండా వాడండి!

హెయిర్ ఫాల్.దాదాపు అందర్నీ సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.అలాగే ఇటీవల రోజుల్లో చాలామంది చిన్నవయసులోనే వైట్ హెయిర్ సమస్యను ఎదుర్కొంటున్నారు.వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.

 This Is A Magical Oil That Checks Hair Fall And White Hair! Hair Fall, White Hai-TeluguStop.com

అయితే జుట్టు తెల్లబడిన తర్వాత బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

వారంలో రెండే రెండు సార్లు ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడితే వైట్ హెయిర్ తో పాటు హెయిర్ ఫాల్ సమస్యకు సైతం చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందు పది ఉసిరికాయలు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.పూర్తిగా ఆరిన ఉసిరికాయలను గింజ తొలగించి ముక్కలు కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Latest, Magical Oil, White-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో అరకప్పు ఆవనూనె, అరకప్పు నువ్వుల నూనె వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ను వేసుకోవాలి.మ‌రియు గుప్పెడు కచ్చాపచ్చాగా దంచుకున్న కరివేపాకుని కూడా వేసి ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఉడికించాలి.

ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Latest, Magical Oil, White-Telugu Health

ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించడానికి ముందు ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వరకు అప్లై చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపూ ఉపయోగించి తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే వయసు పెరిగిన తెల్ల జుట్టు సమస్య దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

అలాగే కుదుళ్లు స్ట్రాంగ్ గా మార‌తాయి.దాంతో హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube