కిడ్నీల‌ను శుభ్రం చేసే బెస్ట్ డిటాక్స్‌ డ్రింక్ మీకోసం!

మూత్ర‌పిండాలు(కిడ్నీ) శుభ్రంగా లేకుంటే ఏదో ఒక స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

మ‌త్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం, ఇన్ఫెక్ష‌న్ సోక‌డం, కిడ్నీల ప‌ని తీరు నెమ్మ‌దించ‌డం ఇలా ఏదో ఒక‌టి జ‌రుగుతుంది.

అందుకే కిడ్నీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు డిటాక్స్‌ చేసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే బెస్ట్ డిటాక్స్‌ డ్రింక్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ డిటాక్స్ డ్రింక్ ఏంటో.? ఎలా త‌యారు చేయాలో.? చూసేయండి.

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక క‌ప్పు యాపిల్ ముక్క‌లు, అర క‌ప్పు కీర దోస ముక్క‌లు, అర క‌ప్పు బీట్‌రూట్ ముక్క‌లు, గుప్పెడు పాల కూర‌, అర క‌ప్పు ట‌మాటా ముక్క‌లు, కొద్దిగా కొత్తి మీర‌, వేసుకుని మెత్త‌గా బ్లండ్ చేసి జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ సేవించాలి.వారంలో రెండంటే రెండు సార్లు ఈ డిటాక్స్ డ్రింక్‌ను సేవిస్తే గ‌నుక మూత్రపిండాల్లో ఉన్న వ్య‌ర్థాల‌తో పాటు శ‌రీరంలో పేరుకు పోయిన వ్య‌ర్థాలు సైతం బ‌య‌ట‌కు పోతాయి.

Advertisement

అంతే కాదు, ఈ డిటాక్స్ డ్రింక్‌ను సేవించ‌డం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఈ డిటాక్స్ డ్రింక్‌లో ఉండే ప‌లు పోష‌కాలు మెదడు యొక్క చురుకుద‌నం పెంచి జ్ఞాప‌క శ‌క్తిని రెట్టింపు చేస్తుంది.

అలాగే పైన చెప్పుకున్న డిటాక్స్ డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త హీన స‌మ‌స్య దారి చేర‌కుండా ఉంటుంది.గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

శ‌రీరం బ‌రువు అదుపులోకి వ‌స్తుంది.కంటి చూపు పెరుగు తుంది.

చ‌ర్మ సంబంధిత‌, జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌రియు వ్య‌ద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు