బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు( Pallavi Prashanth ) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.బిగ్ బాస్ షో( Bigg Boss ) తర్వాత యూట్యూబ్ లో పల్లవి ప్రశాంత్ ఎక్కువగా కనిపించకపోయినా ప్రశాంత్ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
అక్షయ తృతీయ సందర్భంగా తల్లికి 15 లక్షల రూపాయల ఖరీదైన నగను కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
పల్లవి ప్రశాంత్ తల్లిపై( Pallavi Prashanth Mother ) చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
బిగ్ బాస్ షో సీజన్7 లో విజేతగా నిలవగా ఆ సమయంలో పల్లవి ప్రశాంత్ కు 15 లక్షల రూపాయల విలువైన ఆ జ్యూవెలరీని( Jewellery ) కూడా ఆఫర్ చేశారు.అయితే ఆ గిఫ్ట్ సరిగ్గా అక్షయ తృతీయ రోజున అందడం పల్లవి ప్రశాంత్ కు ప్లస్ అవుతోంది.
పల్లవి ప్రశాంత్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అమ్మకు తొలికానుక. బిగ్ బాస్ సీజన్7 కు థ్యాంక్స్, థాంక్యూ నాగ్ సార్ అని పోస్ట్ పెట్టారు.
బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడిగా అడుగు పెట్టడం పల్లవి ప్రశాంత్ కు ప్లస్ అయింది.పల్లవి ప్రశాంత్ చేసిన పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.పల్లవి ప్రశాంత్ కెరీర్ ను ప్లాన్ చేసుకునే తీరును బట్టి ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.పల్లవి ప్రశాంత్ కష్టాన్ని నమ్ముకుంటే కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పల్లవి ప్రశాంత్ సినిమాలపై ఫోకస్ పెడతారో లేక యూట్యూబ్ పై ఫోకస్ పెడతారో తెలియాల్సి ఉంది.రైతుబిడ్డగా వచ్చిన గుర్తింపును పల్లవి ప్రశాంత్ కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.పల్లవి ప్రశాంత్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.