1.ఈటెల భద్రతపై కేటీఆర్ ఆరా

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భద్రత గురించి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ ను ఆరా తీశారు.
2. మంత్రి పువ్వాడ పై పొంగులేటి కామెంట్స్
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు .అధికార మదంతో కొంతమంది ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నారని, దౌర్జన్యాలు పెరిగిపోయాయని పొంగులేటి విమర్శించారు.
3.కొనసాగుతున్న బట్టి పాదయాత్ర

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 15వ రోజు సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మోతే నుంచి ప్రారంభం అయ్యింది.
4.భారీ వర్షాలు కురిసే అవకాశం
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరించింది.
5.పవన్ కళ్యాణ్ పై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏపీలోనూ పోటీ చేస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు అన్న లాంటివాడు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
6.పీవీ నరసింహారావు పై కేసీఆర్ కామెంట్స్
దేశం శ్రేష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ మన పివి నరసింహారావుని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
7.కురుపాం లో జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో పర్యటించారు.అమ్మఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు.
8.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు.టికెట్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.
9.తొలి ఏకాదశి సందర్భంగా అన్నవరంలో.

రేపు తొలి ఏకాదశి సందర్భంగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో మహావిష్ణువు అలంకారంలో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
10.అమల్లోకి ఈ స్టాంపింగ్ విధానం
నేటి నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ స్టాంపింగ్ విధానం అమల్లోకి రానుంది.నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత, అక్రమాలకు పెట్టేందుకు ఈ స్టాంపింగ్ విధానం ను నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
11.హోమ్ మంత్రి పర్యటన

తూర్పుగోదావరి జిల్లాలో హోంమంత్రి తానేటి వనిత పర్యటిస్తున్నారు.
12.బీసీ మోర్చా నేతల సమావేశం
నెల్లూరులోని బిజెపి కార్యాలయంలో బీసీ మార్చా నేతలు సమావేశం అయ్యారు.
13.భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్ర

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టిడిపి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్రను ప్రారంభించారు.
14.చంద్రయాన్ రాకెట్ ప్రయోగం
జులై 13 మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు చంద్రియాలు 3 ని ప్రయోగించనున్నారు.ప్రయోగంపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సమీక్ష నిర్వహించారు.
15 ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు సెలవులు

ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగించారు హాస్టల్ లో అంతర్గత మరమ్మత్తులు కారణంగా సెలవులను పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
16.సింహాద్రి అప్పన్న సన్నిధిలో
నేడు సింహాద్రి అప్పన్న సన్నిధిలో తుది విడత చందనం అగరవేత ప్రారంభం కానుంది.ఆశాల పౌర్ణమి నాడు 125 కేజీల ఆఖరి విడత పచ్చి చందనాన్ని స్వామి వారికి అలంకరించనున్నారు.
17.కరకట్ట నివాసం జప్తుపై నేడు తీర్పు

టిడిపి చంద్రబాబు కరకట్ట నివాసం జప్తుకు ఇవ్వాలనే సిఐడి పిటిషన్ పై నేడు ఏసీబీ న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.
18.ఖమ్మం కు రేవంత్ రెడ్డి రాక
రేపు ఖమ్మం కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నారు .వచ్చే నెల 2 న జరగనున్న ఏఐసిసి నేత రాహుల్ గాంధీ సభ స్థలి పరిశీలనకు రేవంత్ వచ్చారు
19.బిజెపి మేర బూత్ సబ్సే మస్బుథ్

రేపటి నుంచి వారం రోజులపాటు తెలంగాణలో బిజెపి మేర బూత్ సబ్సే మస్బుథ్ ప్రారంభించనున్నారు.
20.తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.తెలంగాణ పోలీస్ నియామక పరీక్షల్లోని తప్పులను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు.