యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇలాంటి క్రమం లోనే ఆయన సందీప్ రెడ్డి వంగతో( Sandeep Reddy Vanga ) చేస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయాల మీద చాలా రకాల అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.ఇక మొత్తానికైతే సందీప్ రెడ్డివంగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని చాలా పకడ్బందీగా రాసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఎలాగైనా సరే ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యం గా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇంతకుముందు ఆయన చేసిన అనిమల్ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.మరి స్పిరిట్( Spirit ) సినిమాతో ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తాడు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలి అంటే స్క్రిప్ట్ చాలా ఎంగేజింగ్ గా ఉండాలి.అలాగే ప్రబాస్ ను చాలా కొత్తగా చూపిస్తే ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయంటూ ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా మీద మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ప్రభాస్, కల్కి, రాజ్యసాబ్ లాంటి సినిమాలతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అయితే ఈ సినిమాలు సూపర్ సక్సెస్ అయితే రాబోయే సినిమాల మీద కూడా ప్రభాస్ భారీ అంచనాలైతే ఉంటాయి.మరి ప్రభాస్ ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.కాబట్టి ఇదే పేర్లు కంటిన్యూ చేయాలంటే మాత్రం తను చాలా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది…
.