జబర్దస్త్ షో( Jabardasth ) ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.ఎంతో మంది స్టార్ కమెడియన్లు అయిపోయారు.
హీరోలుగా రాణిస్తున్నారు.దర్శకులుగానూ మారారు.
హైపర్ ఆది రాజకీయాల్లోనూ బిజీ అవుతున్నాడు.ఇలా వందల, వేల మందికి ఉపాధితోపాటు లైఫ్ ఇస్తుంది జబర్దస్త్.
అలా ముక్కు అవినాష్( Mukku Avinash ) కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యాడు.ఎంతో ప్రయత్నాలు చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు.
చివరికి ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే పైకీ నవ్వుతూ కనిపించే అవినాష్ లైఫ్ లో ఎన్నో కష్టాలు ఉన్నాయి.
తినడానికీ తిండి లేక రోజులు కూడా ఉన్నాయి.
కిరాణ షాపులో పనిచేయడం, ఆఫీస్ బాయ్‌గా చేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
అదే సమయంలో అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి.తాజాగా జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఆ విషయాలను బయటపెట్టాడు.అంజి టాక్స్ తో సూసైడ్ చేసుకోవాలనుకునే పరిస్థితికి దారి తీసిన అంశాలను బయటపెట్టాడు.అవినాష్ ఇంటర్ అయిపోయాక హైదరాబాద్ వచ్చాడు.
బిటెక్ చేసే సమయంలో ఇంట్లో నుంచి పంపించే డబ్బులు సరిపోయేవి కావట.మూడు వేలు పంపిస్తు, రూమ్‌రెంట్ కే అయ్యేదట.
దీంతో తన ఖర్చులకు కోసం ఆయన కొన్ని రోజులు కిరాణ షాపులో పనిచేశాడు.అంతేకాకుండా ఒక ఆఫీసులో ఆఫీస్ బాయ్‌గానూ( Office Boy ) చేశాడట.అలాగే ఐస్ క్రీమ్ బండి కూడా నడిపించినట్టు తెలిపాడు.అంతకుముందే తనకు మిమిక్రీ అంటే ఇష్టం.తండ్రితో పాటు ముంబయి వెళ్లాడట.అక్కడ క్లిక్ కాలేదు.
దీంతో హైదరాబాద్ వచ్చి స్టడీస్‌పై ఫోకస్ చేశాడు.కానీ సినిమాల పిచ్చిపోలేదు.
బిటెక్ చదివే సమయంలోనే అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగారట.చివరికి ఒక ఛాన్స్ వస్తే ఎడిటింగ్‌లో పోయిందట.
మరోసారి ఓ టీవీ షోలో ఛాన్స్ వస్తే అది కూడా ఎడిటింగ్‌లో లేచిపోయిందట.కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా షూటింగ్లో పనులు చేసేవాడట.
ఈ క్రమంలో అదిరే అభి( Adhire Abhi ) పరిచయం అయ్యాడని, ఆయన తనని జబర్దస్త్ లోకి తీసుకొచ్చినట్టు తెలిపాడు.కంటెస్టెంట్‌గా ఉన్న తాను, మంచి కామెడీతో టీమ్ లీడర్ అయినట్టు తెలిపారు.కార్తీక్ తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, కలిసి షోస్ చేసినట్టు తెలిపారు.జబర్దస్త్ లో మనీ వస్తుండటంతో నమ్మకం వచ్చిందట.అది కూడా టీమ్ లీడర్ అయ్యాక తనపై తనకు కాన్పిడెన్స్ వచ్చిందని అన్నారు అవినాష్.అయితే జబర్దస్త్ లో ఫామ్‌లో ఉన్న సమయంలోనే తాను ఇళ్లు కట్టుకున్నాడట.
సేవ్ చేసిన డబ్బులన్నీ అయిపోయాయి.జీరో బ్యాలెన్స్ కి వచ్చింది.
అప్పుడే కరోనా( Corona ) వచ్చింది.లాక్ డౌన్ పడింది.
నెల నెల అప్పులకు వడ్డీలు కట్టాలి.
అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడిపెరిగింది.ఇంటి కోసం కొంత అప్పుడు చేయాల్సి వచ్చిందని, దీంతో కొంత మంది డబ్బులు తెచ్చినట్టు తెలిపారు అవినాష్.అయితే తన కామెడీ నచ్చి వాళ్లు ఎంతో పొగిడే వాళ్లు,మీ కామెడీ బాగుంటుంది మీరు అడిగితే ఇవ్వమా అని ఆ సమయంలో డబ్బులు ఇచ్చారట.
కానీ కరోనా సమయంలో పని లేకపోవడంతో వడ్డీలు కట్టలేకపోయాడట.దీంతో కామెడీ బాగుందని పొగిడినవాళ్లే ఆ తర్వాత తిట్టడం స్టార్ట్ చేశారట.అలా ఆ సమయంలో మొహం మీదే తిట్టినవాళ్లు చాలా ఉన్నారట.దీంతో ఒత్తిడిపెరిగిపోయిందని, ఏంచేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్నారు అవినాష్.