కూతురి వల్లే బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్.. బాలయ్య చిన్నల్లుడు చెప్పిన సీక్రెట్స్ ఇవే!

నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు.

 Balakrishna Go Back To Back Hits Behind Daughter Tejaswini Secret Revealed Balay-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటూ అన్ స్టాపబుల్ అనే షోతో( Unstoppable ) ప్రేక్షకులను మరింత మెప్పించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.వరుసగా మూడు హిట్లు కొట్టి జోరు మీదున్నారు.

బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో దూసుకుపోతున్నాడు.కెరీర్‌ ప్రారంభంలో ఇలా వరుస విజయాలు అందుకున్నారు.

Telugu Akhanda, Balakrishna, Balakrishnahits, Bhagwant Kesari, Tollywood, Veera

ఇప్పుడు మళ్లీ బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో దూసుకుపోతున్నారు.ఇక చివరిగా అనిల్ దర్శకత్వంలో వచ్చిన భగవంతు కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించారు బాలయ్య బాబు.ఇది జోనర్‌ మూవీ కాదు, ఇందులో ఫన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, కూతురు సెంటిమెంట్‌, ఇన్‌స్పైర్‌ చేసే అంశాలు ఉన్నాయి.బాలయ్యకి ఒక కొత్త తరహా సబ్జెక్ట్ అని చెప్పాలి.

అయినా ఈ మూవీతో హిట్‌ కొట్టాడు.ఇలా అఖండ వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి ( Akhanda ,Veera Simhareddy, Bhagwant Kesari )సినిమాలతో మూడు హిట్లని అందుకున్నారు.

అయితే బాలయ్యలో వచ్చిన మార్పుకి, సినిమాల పరంగా వరుస విజయాలకు సంబంధించిన ఓ బలమైన కారణం ఉందట.

Telugu Akhanda, Balakrishna, Balakrishnahits, Bhagwant Kesari, Tollywood, Veera

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారట.అది ఎవరో కాదు ఆయన చిన్న కూతురు తేజస్విని( Tejaswini ) ఉన్నారట.

ఆమెకి క్రియేటివ్‌ సైడ్‌ మంచి టాలెంట్‌ ఉందని, సినిమా మేకింగ్‌, ప్రొడక్షన్‌ వంటి వాటిపై ఆసక్తి ఉందని, సినిమాల్లో ఆమె ఇన్‌వాల్వ్ అవుతుందని తెలిపారు బాలయ్య చిన్న అల్లుడు, తేజస్విని భర్త భరత్‌.అలాగే బాలయ్య యంగ్‌ డైరెక్టర్లతో పనిచేయడానికి కారణం తేజస్వినే అని, స్క్రిప్ట్ కి సంబంధించినగా,ఈ చేసే సినిమాలకు సంబంధించినగానీ బాలయ్య ప్రతిదీ తేజూతో డిస్కస్‌ చేస్తారట.

ఆమె ఇన్‌వాల్వ్ మెంట్ ఉంటుందని తెలిపారు.ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుందని తెలిపారు.వీటిపై ఆమెకి ఆసక్తి ఎక్కువ మాత్రమే కాదు, మంచి పట్టు ఉందని కూడా భరత్‌ తెలిపారు.ఆమె ఫీడ్‌ బ్యాక్‌ ద్వారానే బాలయ్య యంగర్‌ డైరెక్టర్లతో పనిచేస్తున్నారని తెలిపారు.

అలాగే యంగ్‌ స్టర్స్ తో చేయడం వల్ల ఫ్రెష్‌నెస్‌ వస్తుందని, అదే ఇప్పుడు బాలయ్య సక్సెస్‌ మంత్రగా మారిందన్నారు భరత్.దీని వెనుకాల తేజస్విని పాత్ర ఉంటుందని అన్నారు.

`

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube