జనసేన నేత, నాగబాబు ( Naga Babu )ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మరీ దారుణంగా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా నాగబాబు తిరుపతి రోడ్ షోలో ( Tirupati Road Show )మాట్లాడుతూ మే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇస్తున్నారని వైసీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికీ డబ్బులు అందించడంతో పాటు డబ్బులు ఇచ్చిన ప్రజల వేళ్ళపై ఓటు వేసినట్లుగా సిరా మార్కు వేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
నాగబాబు చేసిన ఈ సంచలన ఆరోపణలు ఏపీ ఎన్నికల కమిషన్( AP Election Commission ) దృష్టికి రాగా ఎన్నికల కమిషన్ తప్పుడు ప్రచారం చేస్తున్న నాగబాబుకు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది.నాగబాబుకు మెట్టుతో కొట్టినట్టు ఎన్నికల కమిషన్ బుద్ధి చెప్పిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల కమిషన్ నాగబాబు ట్వీట్ ను కోట్ చేయడంతో పాటు నాగబాబు కామెంట్లకు ఒకింత గట్టిగానే బదులిచ్చిందని చెప్పాలి.
నాగబాబు చేసిన కామెంట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది.ఒక సమాచారం షేర్ చేసే సమయంలో ఆ సమాచారం ఖచ్చితమైనదా కాదా అనేది ముందుగానే నిర్ధారించుకొని నిజాలను పోస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.నిజాలను పోస్ట్ చేయండి.
అందరూ కలిసి ఓటింగ్ ప్రక్రియను ప్రోత్సహిద్దామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
నాగబాబుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఘాటు జవాబుతో ఇకనైనా ఆయన తప్పుడు ప్రచారాలు చేయకుండా సైలెంట్ గా ఉంటారేమో చూడాల్సి ఉంది.ఏపీలో ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఓటమి భయంతోనే నాగబాబు ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాగబాబు వల్ల జనసేనకు లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.