రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులకు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజి ఆశీస్సులతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్ మెంట్ వారు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు.ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్యం,ఆనందం,ఆహ్లాదం,చక్కని భవిషత్తు ధ్యానం వల్ల పొందవచ్చని తెలియజేశారు.
శాఖాహారం తినడం వల్ల మెరుగైన ఆరోగ్య జీవనం పెంపొందుతుంద ని ప్రతిరోజు ఒక గంట పాటు ధ్యానం చేయాలని సూచించారు.విద్యార్థులకు అనంతరం విద్యార్థులకు జ్ఞాన బోధన పుస్తకాలని అందజేశారు.
ఈ కార్యక్రమంలో యాదయ్య గౌడ్, అఖిల,పావని, సురేష్, రిషిక లు, ప్రధానోపాధ్యాయులు శంకర్, నారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.