12 వేలు ఇస్తానంటే కుదరదు.రైతుల పక్షాన పోరాడుతాం అబద్దాల కాంగ్రెస్ కు రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు చందుర్తిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా : అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయాలని చందుర్తి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య అన్నారు.బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మడ లక్ష్మీనరసింహారావు పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.రైతులను ప్రోత్సహించడం కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడిందని, అదే స్ఫూర్తిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కిసాన్ యోజన పేరుతో రైతులకు సాయం అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుండి రైతుబంధు సాయాన్ని అటకెక్కించిందన్నారు.
రైతులను కాంగ్రెస్ నాయకులు తమ చుట్టూ తిప్పుకోవడానికి సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతున్నారని, టిఆర్ఎస్ హయాంలో ఎలాంటి డిక్లరేషన్లు లేకుండానే రైతులకు నేరుగా ఖాతాలో నిధులు జమ చేశారని అన్నారు.ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లయితే ఎకరాకు 15 వేల ఇవ్వాలని లేనట్లయితే రైతుల పక్షాన పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.