పెళ్లి చేసుకుంటే ధైర్యంగా చెప్పడానికి భయం ఏముంది.64 ఏళ్ల వయసులో మోగ వాళ్ళు అయితే పెళ్లి చేసుకోవడం లేదా ? జయసుధ మూడో పెళ్లి చేసుకుందని చాలా రోజులుగా మీడియా కూడా కూస్తుంది.మీడియాలో వచ్చే అన్ని గాసిప్స్ లాగానే ఆమె పెళ్లి వార్త కూడా అయి ఉంటుందని అంతా అనుకున్నారు.ఆ వార్తలకు జోరు పెరగడంతో జయసుధ స్వయంగా తనకు పెళ్లి కాలేదు అని చెప్పాల్సి వచ్చింది.
తనతో పాటు అన్ని ఫంక్షన్స్ కి వస్తున్న ఆ ఇంగ్లీష్ వ్యక్తి ఫిలిప్ రూలర్ అనే నిర్మాత అని కూడా చెప్పింది.
తనపై, తన జీవితంపై ఒక బయోపిక్ తీయాలని అనుకుంటున్నట్టు, అందుకే అతడు ఇక్కడ తనపై అందరూ చూపించే అభిమానాన్ని స్వయంగా పరిశీలించడానికి వచ్చాడు అంటూ చెప్పింది జయసుధ.అయితే ఎందుకు ఆమె వివరణ క్లారిటీగా లేదు అని అనిపిస్తోంది.బయోపిక్ తీయడానికి నిర్మాత వస్తారా రచయిత వస్తారా అనే ప్రశ్న మొదలైంది.
పైగా బయోపిక్ తీయడానికి అమెరికా నిర్మాతలు ఎందుకు.ఇక ఆమె మొదట వడ్డే రమేష్ బావమరిది కాకర్ల రాజేంద్రప్రసాద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని అతని నుంచి విడిపోయింది.
జితేంద్ర కజిన్ నితిన్ కపూరు 1985లో మరో మారు ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక 2017లో అతడు ఆత్మహత్య చేసుకుని కన్ను మూశాడు.మొదటినుంచి హిందూవైనప్పటికీ ఈ మధ్యలో కొన్ని సమస్యల కారణంగా క్రిస్టియానిటీని పుచ్చుకుంది.తెలుగులో ఎంతోమంది దర్శకులు నిర్మాతలు ఉన్నప్పటికీ అమెరికా నుంచి అతనిని పిలిపించడానికి కారణం ఆమె క్రిస్టియానిటీలోకి ఎందుకు మారింది అని చెప్పేడానికి అని అంటున్నారు.
కానీ అమే పెళ్లి చేసుకున్న, బయోపిక్ తీసుకున్న అది బాహాటంగా చెప్పడానికి భయం ఎంటి ? అంత క్లోజ్ గా అందరి ముందు దొరికితే పెళ్లి అని అందరూ అనుకోవడంలో ఎలాంటి తప్పులేదు.తనపై జనాలు చూపించే అభిమానానికి తీయబోయే బయోపిక్ కి, అమెరికా నుంచి వచ్చిన నిర్మాతకి ఎలాంటి సంబంధం ఉందో అర్థం కావడం లేదు.