2 రోజుల్లో 20 సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటన.. బాలీవుడ్ లో ఏం జరుగుతుంది ?

కరోనా మూలంగా దేశ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ తీవ్ర అవస్థలు పడింది.తొలి వేవ్ నుంచి బయటపడి థియేటర్లు తెరుచుకుంటున్న సమయంలోనే.

 20 Movies Release Date Announced In Just Two Days In Bollywood, Bollywood, 20 Mo-TeluguStop.com

రెండో వేవ్ మొదలయ్యింది.ఈ నేపథ్యంలో మళ్లీ సినిమా హాళ్లు మూత పడ్డాయి.

ప్రస్తుతం చాలా మంది వినోదం కోసం టీవీలనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.లేదంటే ఓటీటీలను వేదికగా మార్చుకుంటున్నారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడ్డా.కొన్ని సినిమాలు విడుదల అయినా.

పూర్తి స్థాయిలో ఇంకా సినిమా థియేటర్లు అన్నీ తెరుచుకోలేదు.ఎప్పుడు పూర్తిగా తెరుచుకుంటాయో? తెలియని పరిస్థితి నెలకొంది కూడా.మళ్లీ థర్డ్ వేవ్ అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో సినిమాల విడుదల అంశంపై దర్శకనిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా సినిమాల సందడి ఎక్కువగా ఉండేది ముంబైలో.

అయితే మొదటి వేవ్ కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లు ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు.తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.

అక్టోబర్ 22 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పింది.ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు మళ్లీ యాక్టివ్ అయ్యారు.

తాము తీసిన సినిమా స్టేటస్ ఏంటి అని తెలుసుకునే పనిలో ఉన్నారు.అంతేకాదు.

ప్రభుత్వ ప్రకటన వచ్చిన రెండు రోజుల్లో 20 సినిమాల విడదలకు సంబంధించిన డేట్లు ప్రకటించారు దర్శకులు.

Telugu Announced, Bollywood, Maharashtra, October-Telugu Stop Exclusive Top Stor

మిగతా సినిమా నిర్మాతలు, దర్శకులు కూడా తమ తమ సినిమాల విడుదదలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎప్పుడు మంచి రోజు ఉంది? ఏ రోజు రిలీజ్ చేస్తే పోటీ లేకుండా ఉంటుంది? అనే అంచనాలు వేసుకుంటున్నారు.అటు మరికొంత మంది వేరే ధోరణిలో ఉన్నారు.

తమ సినిమాలకు హడావిడి అవసరం లేదు.ఎప్పుడు విడుదల చేసినా విజయం సాధిస్తాయనే ధీమాలో ఉన్నారు.

మరికొందరు థర్డ్ వేవ్ రావడానికంటే ముందే తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలని మరికొందరు భావిస్తున్నారు.అందుకే హడావిడిగా సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు.

ఫిల్మ్ మేకర్స్ హడావిడి గురించి చూస్తుంటే మన వారి మాదిరిగానే వీరికి తొందర చాలా ఎక్కువ అనుకుంటున్నారు చాలా మంది జనాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube