పురుషులు రోజూ వాల్ నట్స్ తినాలట.. ఎందుకో తెలుసా?

వాల్ నట్స్.అచ్చం ఇవి మ‌న మోద‌డు ఆకారంలో ఉంటాయి.

 Wonderful Benefits Of Walnuts For Men! Walnuts, Men, Walnuts Benefits, Latest Ne-TeluguStop.com

ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ.వాల్ న‌ట్స్( Wall nuts ) లో పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.

ప్రోటీన్, విట‌మిన్ ఈ, విట‌మిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, ఫైబర్ తో పాటు గుడ్ ఫ్యాట్స్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వాల్ నట్స్ లో నిండి ఉంటాయి.వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

ముఖ్యంగా పురుషులు నిత్యం మూడు లేదా నాలుగు వాల్ నట్స్ ను నైట్ అంతా నానబెట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తినాలని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఇటీవల రోజుల్లో చాలా మంది పురుషులు లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

సంతాన‌లేమితో బాధ‌ప‌డుతున్నారు.అయితే పురుషుల్లో లైంగిక సమస్యల‌కు చెక్ పెట్ట‌గ‌ల సామ‌ర్థ్యం వాల్ నట్స్ కు ఉంది.

వీటిని రోజు తింటే వీర్య వృద్ధి, నాణ్యతను పెంచుతాయి.పురుషుల్లో సంతానోత్పత్తి( Fertility in men ) సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.

లైంగిక కోరికలను సైతం ప్రోత్సహిస్తాయి.

Telugu Tips, Latest, Walnuts-Telugu Health

అలాగే వాల్ నట్స్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరం బరువు అదుపులో ఉంటుంది.మధుమేహం( diabetes ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తంలో చక్కెరను ఇవి అదుపులో ఉంచుతాయి.

వాల్ న‌ట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్( Omega-3 fatty acids ) పుష్క‌లంగా ఉన్నందున‌.వీటిని డైలీ తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య దూరం అవుతుంది.

Telugu Tips, Latest, Walnuts-Telugu Health

అంతేకాదు, నిత్యం వాల్ న‌ట్స్ తినేవారి మెద‌డు చాలా వేగంగా ప‌ని చేస్తుంది.జ్ఞాప‌క‌శ‌క్తి రెట్టింపు అవుతుంది.వాల్ నట్స్‌లో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది.

అందువ‌ల్ల‌, రోజు నాన‌బెట్టిన వాల్ న‌ట్స్ ను తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.మలబద్దకం నుంచి విముక్తి ల‌భించింది.

ఎముక‌లు, దంతాలు సైతం దృఢంగా మార‌తాయి.కాబ‌ట్టి, పురుషుల‌నే కాకుండా ప్ర‌తి ఒక్క‌రూ వాల్ న‌ట్స్ ను రెగ్యుల‌ర్ డైట్ లో ఉండేలా చూసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube