ప్రేమదేశం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు అబ్బాస్( Abbas ) .ఇలా మొదటి సినిమాని ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం ఈయనకు తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమా అవకాశాలు రావడమే కాకుండా ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అబ్బాస్ అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇండస్ట్రీకి దూరమై విదేశాలలో స్థిరపడిన ఈయన కుటుంబ పోషణ కోసం వివిధ రకాల పనులను చేశారు.
ఇలా కుటుంబ పోషణ కోసమే తాను పలు యాడ్స్ చేశానని అలాగే పెట్రోల్ బంకులో పని చేశానని ఇక బైక్ మెకానిక్ గా కూడా పనిచేశానని తెలిపారు.కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి అబ్బాస్ తిరిగి ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోని ఇండియాలోనే ఉన్నటువంటి ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను అలాగే ఇండస్ట్రీలో పలువురు హీరోల గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా అబ్బాస్ నటుడు సూర్య( Suriya ) గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా అబ్బాస్ సూర్య గురించి మాట్లాడుతూ… సూర్య తన మొదటి చిత్రం నేరుక్కు నెర్ సినిమా సమయం నుంచి నాకు తెలుసని తెలిపారు.కెరియర్ మొదట్లో సూర్య ఎంతో సిగ్గుపడేవారు.ఆయన కెమెరా ముందుకు రావాలంటే ఎంతో కష్టపడేవారని అబ్బాస్ తెలిపారు.అయితే రాను రాను ఆయన జీవితంలో వస్తున్నటువంటి అద్భుతమైన పరివర్తనను చూసి తనకు ఆశ్చర్యం కలిగిందని అబ్బాస్ తెలిపారు.
సినిమాల ఎంపిక విషయంలోనూ పని పట్ల ఆయన ఎంతో చిత్తశుద్ధిని కలిగి ఉన్నారని తెలిపారు.ఇక సూర్య ఇండస్ట్రీలో ఇలాంటి మంచి సక్సెస్ అందుకున్నారు అంటే ఆ విజయం వెనుక జ్యోతిక ( Jyothika ) కూడా ఉన్నారని చెప్పాలి.
సూర్య విజయం వెనుక జ్యోతిక అనే ఓ శక్తి ఉందని, సూర్య సెలబ్రిటీ లందరికీ బెంచ్ మార్క్ అంటూ ఈ సందర్భంగా అబ్బాస్ సూర్య గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.