1.రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
ఈ డిసెంబర్ 12న టిఆర్ఎస్ గులాబీ కూలీ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకు వస్తోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
2.ఏపీ పై నిజామాబాద్ ఎంపీ కామెంట్స్
రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.ఏపీని వెళ్లి మద్రాస్ లో కలపమని అడగాలని కౌంటర్ ఇచ్చారు.
3.బలహీనపడిన మాండస్ తుఫాన్
మాండస్ తీవ్ర తుఫాను క్రమంగా బలహీనపడి తుఫాన్ గా కొనసాగుతోంది.ఈరోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు ,పాండిచ్చేరి ప్రాంతాల్ని తాగుతూ మహాబలిపురం సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
4.బీఆర్ఎస్ ను ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.సీఎం కేసీఆర్ బి.ఆర్.ఎస్ ను లాంఛనంగా ప్రారంభించారు.అనంతం పార్టీ జెండా ను ఆవిష్కరించారు.
5.వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు విచారణ ను జనవరి 3 కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
6.మెట్రో సెకండ్ ఫేస్ కు కేసిఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ లో మెట్రో సెకండ్ ఫేజ్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ , మహమూద్ ఆలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , మల్లారెడ్డి ,సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
7.సజ్జల రెండు రాష్ట్రాలకు క్షమాపణలు చెప్పాలి
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలకు క్షమాపణలు చెప్పాలని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
8.సోనియాగాంధీకి శుభాకాంక్షలు తెలిపిన మోది
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
9.వారాహి గురించి మాట్లాడే అర్హత వైసిపికి లేదు
వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత వైసిపికి లేదని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
10.ఉద్యోగాలు కల్పించాలంటూ హిజ్రాల ఆందోళన
కానిస్టేబుల్ ఎస్సై దేహదారుద్య పరీక్షలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీ దగ్గర హిజ్రాలు ఆందోళనకు దిగారు .ఆడ మగతో పాటు తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
11.ముందుకొచ్చిన సముద్రం
మండస్ తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది.నెల్లూరు జిల్లాలో పాలుచోట్ల 10 నుంచి 20 మీటర్ల దూరం సముద్రం ముందుకు వచ్చింది.
12.కెసిఆర్ పై ఈటెల రాజేందర్ కామెంట్స్
రాష్ట్రాన్ని బాగు చేసే సత్తా లేదు కానీ దేశాన్ని బాగు చేస్తాడంట అంటూ, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు.
13.ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగాలు భర్తీకి సాధారణ నోటిఫికేషన్ విడుదల చేసింది.
14.మాండూస్ ఎఫెక్ట్ : విద్యాసంస్థలకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన మనసు తుఫాను ప్రభావం వల్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి.దీంతో విద్యాసంస్థలకు జిల్లా అధికారులు సెలవు ప్రకటించారు. 15.త్వరలో అందుబాటులోకి గోవిందా యాప్
భక్తులకు సౌలభ్యం కోసం మరింతగా గోవిందా యాప్ ను డెవలప్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది.ఈ యాప్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు ,సేవలు ,వసతి గృహాలను బుక్ చేయడంతో పాటు , సమాచారం అంతా భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా దీనిని రూపొందించే పనిలో ఐటీ విభాగం ఉంది.
16.12వ రోజుకు చేరిన సంజయ్ యాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది.కోరుట్ల నియోజకవర్గంలోని వేంపేట గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి సంజయ్ పాదయాత్ర మొదలైంది.
17.గుంటూరులో కేంద్ర మంత్రి పర్యటన
నేడు గుంటూరులో కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ముక్ మీత్ భాటియా , ప్రీ మాట్రిక్ బాలికల హాస్టల్లతో పాటు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించనున్నారు.
18.నిరుద్యోగులకు జాబ్ మేళా
నేడు గుంటూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
19.డబల్ డెక్కర్ రైలు గుంటూరు వరకు పొడిగింపు
విశాఖపట్నం విజయవాడ మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలు గుంటూరు వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -49,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,280
.