రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలుగు వెలుగు సాహితి కళావేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పరిష్కరించుకొని విశిష్ట సేవలకు గుర్తింపుగా తెలుగు వెలుగు నంది జాతీయ అవార్డును త్యాగరాయగాన కళ నిలయము నందు రాజన్న సిరిసిల్లకు చెందిన గంభీరావుపేట గ్రామవాసి మల్లు గారి నర్సయ్య గౌడ్ విశిష్ట సేవలకు గుర్తింపుగా బహుకరించారు.ఈ సందర్భంగా వారు గత 46 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి విశిష్ట వివిధ రకాల సేవలను ప్రశంసిస్తూ ఈ సేవా రంగంలో ఇంకా ఉత్సాహంగా ఇంకా స్ఫూర్తిదాయకంగా సమాజానికి సేవలు కొనసాగింపుగా ఉండాలని అటువంటి ఉద్దేశం కొద్దీ ఈ నంది అవార్డును బౌకరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అనేక సాహితీ సాంస్కృతిక విద్యా వైద్య కళా సేవా రంగాల్లో ఎన్విరామంగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సేవలకు ప్రశంసగా ఈ బహుమతి పొందడం ఆనందంగా ఉందని సందర్భంగా నంది అవార్డు గ్రహీత నర్సయ్య గౌడ్ అన్నారు.జాతీయస్థాయి నంది అవార్డు పొందడానికి సహకరించిన నా మిత్రులకు శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు పేరుపేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నర్సయ్య గౌడ్ తెలిపారు.