రక్తదానం ప్రాణదానంతో సమానం - 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి అనుసంధానంతో రక్తదాన కార్యక్రమం ను నిర్వహించారు.ఈ సందర్భంగా కమాండెంట్ యస్.

 Donation Of Blood Equals Donation Of Life 17th Police Battalion Commandant S Sri-TeluguStop.com

శ్రీనివాస‌‌‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో  ఏర్పాటు చేసినట్లు చెప్పారు.రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అధికారులు, సిబ్బంది అందరిని అభినందించారు.

మీరు చేసే ఈ రక్తదానం ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడుతుంది అని అన్నారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కమాండెంట్ సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ.జయప్రకాష్ నారాయణ, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ ఎండి.డిసిఎచ్ ప్రొఫెసర్ & హెచ్.

ఓ.డి పాథాలజీ విభాగం, ఆస్పత్రి వైద్య సిబ్బంది, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube