అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన తమన్నా... పెళ్లి డేట్ చెప్పేసిందిగా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు మరొక రెండు రోజులలో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి( Varun Tej Lavanya tripathi ) పెళ్లి చేసుకోబోతున్నారు అలాగే వెంకటేష్ కుమార్తె కూడా పెళ్లి చేసుకోబోతుంది.

 Thamannah And Vijay Varma Marriage News Goes Viral, Thamannah, Vijay Varma,-TeluguStop.com

అలాగే హీరో అర్జున్ కుమార్తె కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

ఇలాంటి తరుణంలోనే తమన్నా( Thamannaa ) కూడా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.తమన్నా గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma ) తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Telugu Arjun, Bollywood, Thamannah, Tollywood, Varun Tej, Vijay Varma-Movie

ఇలా విజయ్ వర్మతో ( Vijay Varma )ప్రేమలో ఉన్నటువంటి తమన్న తరచూ ఆయనతో కలిసి వెకేషన్ లోకి వెళ్లడం పెద్ద ఎత్తున బయట సందడి చేయడం జరుగుతుంది.ఈ క్రమంలోని పెళ్లెప్పుడు అంటూ చాలామంది ఇదివరకే తమన్న ప్రశ్నించారు.అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని కెరియర్ పై దృష్టి పెట్టాను అంటూ ఈమె చెప్పుకొచ్చారు.కానీ విజయ్ వర్మ ఇంటిలో మాత్రం పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే తమన్న కూడా తన పెళ్లి తేదీని ప్రకటించారని తెలుస్తోంది.

Telugu Arjun, Bollywood, Thamannah, Tollywood, Varun Tej, Vijay Varma-Movie

తమన్నా విజయ్ వర్మ నవంబర్ 17వ తేదీ నిశ్చితార్థం ( Engagement ) జరుపుకోబోతున్నారట ఇలా నిశ్చితార్థమైన అనంతరం వచ్చేయడాది మార్చి ఆఖరి వారంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.ఇలా తమన్నా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న విషయం అభిమానులకు నిజంగానే సర్ప్రైజ్ అని చెప్పాలి.ఇలా ఒక్కొక్కరుగా ఇండస్ట్రీకి చెందినవారు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడబోతున్నారు.ఇక తమన్నా కూడా ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube