రక్తదానం ప్రాణదానంతో సమానం – 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి అనుసంధానంతో రక్తదాన కార్యక్రమం ను నిర్వహించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస‌‌‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో  ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అధికారులు, సిబ్బంది అందరిని అభినందించారు.

మీరు చేసే ఈ రక్తదానం ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడుతుంది అని అన్నారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కమాండెంట్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ.జయప్రకాష్ నారాయణ, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ ఎండి.

డిసిఎచ్ ప్రొఫెసర్ & హెచ్.ఓ.

డి పాథాలజీ విభాగం, ఆస్పత్రి వైద్య సిబ్బంది, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భోజనం తర్వాత ఈ మ్యాజికల్ లడ్డూ తింటే అజీర్తి, గ్యాస్ అన్న మాటే అనరు!