మాస్టర్ ట్రైనర్స్ కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) శనివారం నాడు, జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో భాగంగామాస్టర్ ట్రేనర్స్ కు శిక్షణ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి హాజరైన, సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ , మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా నూతన ఓటరు నమోదు మార్పులు, చేర్పులు (బిఎల్ఓ) బూతు లెవెల్ అధికారుల విధులు తదితర అంశాలపై ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుందని,ఏఎల్ఎంటిఎస్, కు శిక్షణ ఓటర్ జాబితా తయారీ లో బూత్ స్థాయి అధికారి పాత్ర , విధుల బాధ్యతల గురించి శిక్షణ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.భారత ఎన్నికల సంఘం , తెలంగాణ రాష్ట్రం ఎన్నికల అధికారి ఆదేశాల మెరకు ఈరోజు అసెంబ్లీ స్థాయి మాస్టర్ త్రైనర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 Special Training Program For Master Trainers ,rajanna Sirisilla District , Spe-TeluguStop.com

ఇందులో బూత్ స్థాయి అధికారి ఓటర్ గా నమోదు చేయడానికి, మార్పులు, చేర్పులు గురించీ ఏ యే ఫారాలు నింపాలి , గృహ సందర్శన సమయం లో ఓటరు నమోదు తీసుకోవాల్సిన దృవ పత్రాలు ఏమి అవసరం, తొలగించడానికి ఏ ఫారం వినియోగించాలి.తొలగించాలంటే ఏయే దృవ పత్రాలు అవసరం , మార్పులు, చేర్పులకు ఏ ఫారం వాడాలి అనేదానిమీద శిక్షణ ఇచ్చారు బి ఎల్ ఓ ల విధులు, బాధ్యతలు, బి ఎల్ ఓ అప్లికేషన్ పై అవగాహన కల్పించారు.జనవరి1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు ఈ శిక్షణ తరగతులలో మాస్టర్ ట్రైనర్లు మహేందర్ రెడ్డి, శ్రీధర్, తహశీల్దార్ లు, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube