మాస్టర్ ట్రైనర్స్ కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) శనివారం నాడు, జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో భాగంగామాస్టర్ ట్రేనర్స్ కు శిక్షణ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి హాజరైన, సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ , మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా నూతన ఓటరు నమోదు మార్పులు, చేర్పులు (బిఎల్ఓ) బూతు లెవెల్ అధికారుల విధులు తదితర అంశాలపై ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుందని,ఏఎల్ఎంటిఎస్, కు శిక్షణ ఓటర్ జాబితా తయారీ లో బూత్ స్థాయి అధికారి పాత్ర , విధుల బాధ్యతల గురించి శిక్షణ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

భారత ఎన్నికల సంఘం , తెలంగాణ రాష్ట్రం ఎన్నికల అధికారి ఆదేశాల మెరకు ఈరోజు అసెంబ్లీ స్థాయి మాస్టర్ త్రైనర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో బూత్ స్థాయి అధికారి ఓటర్ గా నమోదు చేయడానికి, మార్పులు, చేర్పులు గురించీ ఏ యే ఫారాలు నింపాలి , గృహ సందర్శన సమయం లో ఓటరు నమోదు తీసుకోవాల్సిన దృవ పత్రాలు ఏమి అవసరం, తొలగించడానికి ఏ ఫారం వినియోగించాలి.

తొలగించాలంటే ఏయే దృవ పత్రాలు అవసరం , మార్పులు, చేర్పులకు ఏ ఫారం వాడాలి అనేదానిమీద శిక్షణ ఇచ్చారు బి ఎల్ ఓ ల విధులు, బాధ్యతలు, బి ఎల్ ఓ అప్లికేషన్ పై అవగాహన కల్పించారు.

జనవరి1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు ఈ శిక్షణ తరగతులలో మాస్టర్ ట్రైనర్లు మహేందర్ రెడ్డి, శ్రీధర్, తహశీల్దార్ లు, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆ రెండు దేశాలలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?