అరటి పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ సీజన్‌లో అయినా విరివిరిగా లభించే అరటి పండ్లలో అనేక పోషకాలు నిండి ఉన్నాయి.
నీరసంగా ఉన్నవారు ఒక్క అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది.అరటిపండులో ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
మరియు శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇక అరటిపండు ఆరోగ్యానికి కాదు.
ముఖ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.మరి అరటిపండు ముఖానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా పండిన అరటిపండు పేస్ట్‌లో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి.అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి.ముఖం అందంగా,మృదువుగా, ఎంతో కోమలంగా మారుతుంది.

అలాగే అరటిపండు గుజ్జులో కొద్ది పాటు మరియు శనగపిండి కలిపి ముఖానికి పట్టించాలి.అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతుంది.మరియు జిడ్డు చర్మాన్ని తగ్గించడంలోనూ ఈ ఫ్యాక్ గ్రేట్‌గా సహాయపడుతుంది.అదేవిధంగా, అరటిపండు గుజ్జులో కొద్దిగా పసుపు మరియు పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి.
అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముడతల సమస్య తగ్గి.ముఖం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.
ఇక అరటిపండు గుజ్జులో కొద్ది పంచదార వేసి ముఖానికి స్క్రబ్ చేసుకోవాలి.అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.