తన నగ్న వీడియోలను రహస్యంగా తీసి సినిమాలో పెట్టడంతో బలవన్మరణం చెందిన స్టార్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో హీరోల కెరీర్ చాలా దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే హీరో ఒకసారి స్టార్ హీరో అయ్యాక ఆ స్టార్ డమ్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళితే చాలు కానీ హీరోయిన్స్ పరిస్థితి అలా ఉండదు ఒక్క హిట్ తో నైట్ కి నైట్ స్టార్ హీరోయిన్స్ అయిపోతారు.కానీ ఒక రెండు మూడు ఫ్లాప్స్ వస్తే మాత్రం మళ్లీ ఎక్కడికో పడిపోతారు.

 Why Star Heroine Vijaya Sri Ends Her Life. Vijayasri, Divya Bharathi, Tollywood,-TeluguStop.com

అదే హీరో అయితే 2, 3 ఫ్లాప్స్ వచ్చిన మళ్లీ ఇంకో రెండు పెద్ద సినిమాలు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.ఇక్కడ హీరోయిన్స్ పరిస్థితి ఏమిటంటే వాళ్ళ కెరియర్ ఎంత పిక్స్ లో ఉన్న వాళ్ల కెరియర్ మహా అయితే మూడు లేదా నాలుగు సంవత్సరాలు ఇంకా గట్టిగా చెప్పాలంటే పెద్ద హీరోయిన్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒక నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ పడితే అప్పుడు అలాంటి హీరోయిన్ కెరియర్ ఒక పది సంవత్సరాల పాటు కొనసాగుతుంది అంతే తప్ప అంతకు మించి కొనసాగడం అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి.

ఎందుకంటే 10 సంవత్సరాల వరకు ప్రేక్షకుల అభిరుచి లో మార్పులు రావచ్చు.అప్పుడు ఉన్న ప్రేక్షకులు ఇప్పుడు ఉండే హీరోయిన్స్ ని చూడక పోవచ్చు, కొత్తదనం వైపు అడుగులు వేయొచ్చు.

అందుకే ఎంత టాలెంట్ ఉన్న ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి 10 సంవత్సరాల వరకు హీరోయిన్స్ గా కొనసాగుతుంది.అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం స్టార్ హీరోయిన్ అయిన తర్వాత స్టార్ స్టేటస్ అనుభవించక మధ్యలోనే సూసైడ్ చేసుకుని చనిపోయారు.

వాళ్లలో ముందుగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి రాజా సినిమాలో హీరోయిన్ గా చేసిన దివ్యభారతి గురించి చెప్పాలి.బొబ్బిలి రాజా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయి అందులో హీరోయిన్ గా చేసిన దివ్యభారతి కి మంచి పేరు వచ్చింది దాని తర్వాత రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన రౌడీ అల్లుడు సినిమాలో మెగా స్టార్ పక్కన ఆడిపాడింది.ఆ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవడంతో దివ్యభారతి తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయింది.

అయితే ఏం జరిగిందో గానీ ఆమె ఆ స్టార్ స్టేటస్ ని అనుభవించలేక మధ్యలోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది.దివ్యభారతి గారి కంటే ముందే మలయాళంలో అగ్రహీరోయిన్ గా వెలుగొందిన విజయశ్రీ గారి పరిస్థితి కూడా ఇలాంటిదే.

Telugu Divya Bharathi, Vijayasri, Kuncha Ko, Vijaya Sri-Telugu Stop Exclusive To

70వ దశకంలో ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి నటించే ఏకైక నటి విజయ శ్రీ, ఆమె కెరీర్ ని ప్రారంభించిన మొదటిలోనే మంచి హిట్స్ సాధించింది.ఈవిడ ప్రేమ్ నజీర్ అనే హీరోతో ఎక్కువ సినిమాలు చేసింది ఈవిడ స్టార్ హీరోయిన్ అవడానికి ఒకరకంగా కుంచా కో అనే డైరెక్టర్ కూడా కారణం.ఎందుకంటే అందరూ డైరెక్టర్లు ఆమెని ఒక రకంగా చూపిస్తే ఆయన మాత్రం చాలా అందంగా చూపించేవారు.

ఆ డైరెక్టర్ వర్క్ నచ్చిన విజయశ్రీ ఆయనతో ఎక్కువ సినిమాలు చేసింది.అయితే ఆయన 1973లో విజయ శ్రీ తో ఒక సినిమాని తీశారు ఆ సినిమా కి గాను ఒకరోజు షూట్ జరుగుతుంటే తీయాల్సిన ఎపిసోడ్ కాకుండా దానితోపాటు విజయశ్రీ నగ్నంగా ఉన్న వీడియోస్ ని షూట్ చేసి ఆమెను మానసికంగా హింసించాడు అని చాలా మంది అంటారు.

అయితే ఒక రోజు ఈ సినిమా రిలీజ్ కు ముందు విజయశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ కుంచాకో గురించి ఆయన చేసిన బ్లాక్ మెయిల్ గురించి చెప్పింది.దాంతో తన గురించి అలా చెప్పడం జీర్ణించుకోలేక పోయినా కుంచాకో ఆ షూట్ చేసిన వీడియోలను సినిమా లో పెట్టాడు దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయశ్రీ ఆత్మహత్య చేసుకున్నారు.

విజయశ్రీ మలయాళం తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒక సినిమా తీశారు.నాగేశ్వరరావు హీరోగా వి.మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన మంచి కుటుంబం అనే సినిమాలో ఆవిడ మంచి క్యారెక్టర్ చేశారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కష్టం అంటే హీరోయిన్ అయ్యాక కూడా వచ్చే ప్రాబ్లమ్స్ నీ ఎదుర్కోలేక అర్ధాంతరంగా మధ్యలోనే జీవితాన్ని ముగించిన తారలు చాలా మంది ఉన్నారు.

వాళ్లలో వీళ్ళు ఒకరు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube