సాధారణంగా ఒకట్రెండు సినిమాలు భారీ హిట్స్ అయితే అందులో నటించిన హీరో, హీరోయిన్లకు సూపర్ క్రేజ్ వస్తుంది.వారికి అవకాశాలు క్యూ కడతాయి.
ఈ సమయంలోనే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే వచ్చిన పాపులారిటీ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
సరైన సినిమాలు చేయకపోతే వీళ్లు ఇండస్ట్రీలో ఉన్నారా అని అనుమానపడేంతలా కనుమరుగుతారు.ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్లు ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత వచ్చిన స్టార్డమ్ మొత్తం పోగొట్టుకున్నారు.వారెవరో చూద్దాం.
కృతి శెట్టి:
కొంతకాలం క్రితం కృతి శెట్టి( Krithi Shetty ) ఉప్పెన సినిమాతో అఖండ విజయం సాధించింది.ఈ సినిమాలో ఈ తార చాలా అందంగా కనిపించింది.ఆమె చేసిన బేబమ్మ క్యారెక్టర్ బాగా హైలెట్ అయింది.
బంగార్రాజు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదురయ్యాయి.దాంతో ఈ తారకు ఛాన్సెస్ ఒక్కసారిగా తగ్గిపోయాయి.
ఆమె నటించిన సినిమాలు రాకపోవడంతో అసలు ఇండస్ట్రీలో ఉందా లేదా అని అభిమానులు అనుకుంటున్నారు.కృతి త్వరలో కస్టడీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
మనమే అనే ఇంకో సినిమా కూడా చేస్తోంది.ఈ రెండు తప్ప ఆమె చేతిలో ఇప్పుడు పెద్దగా తెలుగు సినిమాలు ఏమీ లేవు.
రకుల్ ప్రీత్ సింగ్:
ధ్రువ, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, కరెంట్ తీగ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎదిగింది.కానీ ఇప్పుడు ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఉందో లేదో కూడా తెలియడం లేదు.నిజానికి ఆమె టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్ళింది.అక్కడ కూడా సినిమాలు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి.
నిధి అగర్వాల్:
ఈ ముద్దుగుమ్మ చాలా టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు.అందంగా కూడా కనిపిస్తుంది ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా వెనకాడదు.కానీ ఎందుకో ఆమెకు అవకాశాలు రావడం లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా ఫెడవుట్ అయిపోయింది.ఈ బ్యూటీ తన జాతకంలో ఏ లోపం ఉందో అని భయపడి వేణు స్వామితో పూజలు కూడా చేయించుకుంది.అయినా ఫలితం లేకపోయింది.
నభా నటేష్
నభా నటేష్( Nabha Natesh ) ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతికే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో లాంటి సినిమాలు చేసింది.అయితే చివరిగా నటించిన ఆమె సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.
అందువల్ల అవకాశాలు అందుకోలేకపోయింది.ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది కానీ ఆ మూవీ పెద్దగా బాగోలేదు.దీనివల్ల ఇండస్ట్రీలో ఆమె ఒకరు ఉన్నారనే సంగతిని ప్రేక్షకులు మర్చిపోయారు.
పూజా హెగ్డే
ఈ బుట్ట బొమ్మ కూడా గత కొన్ని ఏళ్లుగా ఎలాంటి సినిమా చేయలేదు.అందుకే ఈ తార అసలు యాక్ట్ చేస్తుందా లేదా అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.