ఆగస్ట్ 9న ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ విడుదల

నిహారిక కొణిదెల( Niharika Konidela ) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.

 Friendship Love And Emotional Entertainer Committee Kurrollu Movie Releases On A-TeluguStop.com

పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు( Committee Kurrollu Movie ) య‌దు వంశీ ద‌ర్శ‌కుడు.పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక నిర్మాతలు.

గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందించారు.ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది.ఆగ‌స్ట్‌లో వ‌చ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సంద‌ర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌లవుతుంది.

ఈ నేప‌థ్యంలో…

చిత్ర స‌మ‌ర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు.శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ జ‌య‌ల‌క్ష్మిగారితో కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది.

న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఎక్కువ మంది కొత్త వాళ్ల‌తోనే సినిమాను పూర్తి చేశాం.య‌దు వంశీగారు( Yadhu Vamsi ) మంచి ప్లానింగ్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలోనే పూర్తి చేయ‌టం విశేషం.

యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రికీ న‌చ్చే సినిమాతో ఆగ‌స్ట్ 9న ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నాం’’ అన్నారు.

చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘‘ 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం.

వారి మ‌ధ్య స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ‌, ప‌ల్లెటూరిలోని రాజ‌కీయాలు, యువ‌త ప‌డే సంఘ‌ర్ష‌ణ అన్నింటినీ ఈ చిత్రంలో చూపించ‌బోతున్నాం.ఆగ‌స్ట్‌లో ఫ్రెండ్ షిప్ డే వారంలో ఆగ‌స్ట్ 9న క‌మిటీ కుర్రోళ్ళు మూవీ రిలీజ్ అవుతుంది.

ఫ్రెండ్స్ అంద‌రితో క‌లిసి చూసి ఎంజాయ్ చేసేలా, సెల‌బ్రేట్ చేసుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు.

శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ ‘‘ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం.

ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ నిహారిక‌గారితో క‌లిసి క‌మిటీ కుర్రోళ్ళు సినిమా చేయ‌టం మంచి అనుభూతినిచ్చింది.అన్ని ఎలిమెంట్స్ ఉన్న మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను ఆగ‌స్ట్ 9న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి రాజు ఎడురోలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేశారు.ఈ చిత్రానికి వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల సంభాషణలు రాశారు.

నటీనటులు :

సందీప్ సరోజ్,( Sandeep Saroj ) యశ్వంత్ పెండ్యాల,( Yashwant Pendyala ) ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక .ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు.

సాంకతిక వర్గం :

సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం – యదు వంశీ, సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని, ఎడిటర్ – అన్వర్ అలీ, డైలాగ్స్ – వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ – విజయ్, నృత్యం – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌: సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌: శివ‌, ఈవెంట్ పార్ట్‌న‌ర్‌: యు వి మీడియా, మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube