సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకోవడం అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది అయితే ఈ స్టార్ హోదా కోసం ఎంతో హీరోలు పోటీ పడుతూ ఉంటారు.ఇక ఎల్లప్పుడూ ఒకే హీరో టాప్ పొజిషన్ లో ఉండరనే సంగతి తెలిసిందే.
ప్రతి సినిమా సినిమాకు హీరోల స్థానాలు అనేవి మారుతూ ఉంటాయి.ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.
ఇక వీరి తర్వాత తదుపరి చిరంజీవి( Chiranjeevi ) అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా నిలిచారు.అయితే ఈయన స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న తర్వాత రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.ఇలా రాజకీయాల వైపు చిరంజీవి వెళ్లడంతో ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చారు.
ఇక రాజకీయాల ( Politics ) పరంగా చిరంజీవి సక్సెస్ కానీ నేపథ్యంలో ఈయన తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు.అయితే ఇటీవల కాలంలో చిరంజీవి సరైన కథలను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నారా, లేదా ఇతర హీరోలు సరికొత్త కథల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారా అనేది తెలియదు కానీ ఆయన సినిమాలు మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి.

ఇలాంటి తరుణంలోనే బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి( BRS Ex-Minister Malla Reddy ) చిరంజీవి అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.చిరంజీవి తర్వాత స్థానాన్ని అల్లు అర్జున్ ఆక్రమించారని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిపోయిందని, అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ కావాలని ఈయన తెలిపారు.పుష్ప( Pushpa ) సినిమాతో అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయారని.దాన్ని క్రేజ్ కూడా పెరిగిందని ఏకంగా 1800 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని తెలిపారు.
కొత్త తరానికి అల్లు అర్జున్ బాగా కనెక్ట్ అయ్యారంటూ బన్నీ పై మల్లారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.దీంతో ఈయన చేసిన కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.







