తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ కావ్య థాపర్( Kavya Thapar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో చాలా సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈగల్,( Eagle ) డబుల్ ఇస్మార్ట్,( Double Ismart ) విశ్వం, ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.ఈ సినిమాలు విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
ఈ సినిమాలతో కావ్య థాపర్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది.దీంతో ఈ ముద్దుగుమ్మ కి వరుసగారికి అవకాశాలు క్యూ కట్టడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

అనుకున్న విధంగానే కొన్ని సినిమాలలో నటించింది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మెప్పించింది అయితే వర్సెస్ సినిమాలలో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అదృష్టం అంత బాగా కలిసి రాలేదని చెప్పాలి.గత ఏడాది మొత్తం ఈ ముద్దుగుమ్మ హవానే నడిచింది.అయితే అందులో క్లిక్ అయింది కేవలం ఒక్క సినిమా మాత్రమే.మిగిలిన 3 సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.ముఖ్యంగా రవితేజ సరసన నటించిన ఈగల్, రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్, గోపీచంద్ నటించిన విశ్వం సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కావ్య థాపర్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు బోణి కొట్టలేదు ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈమె కొన్ని సినిమాలలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఆ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.కావ్య మాత్రం ఎంచక్కా టూర్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.ప్రస్తుతం ఆమె ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీరును బట్టి చూస్తే ఆమె చేతులు అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తోంది.
మరి ముందు ముందు అయినా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయి ఏమో చూడాలి మరి.ఇకపోతే ప్రస్తుతం కావ్య కజకిస్థాన్ లోని మంచు కొండల్లో విహరిస్తోంది.







