మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక్కడ నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలిచారు.
ఈ విధంగా చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన సేవలను అందించారు.ఇలా సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి అందిస్తున్న సేవలకు కాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆయనకు ఎన్నో పురస్కారాలతో గౌరవించారు.

ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ చేతుల మీదుగా చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.ఇకపోతే తాజాగా చిరంజీవి మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి ఎంపిక అయ్యారు.గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చిరంజీవి అందిస్తున్న సేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం ( UK Government ) చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును( Life Time Achivement Award ) ప్రకటించింది.

మార్చి 19వ తేదీ యూకే పార్లమెంటులో చిరంజీవికి ఈ పురస్కారాన్ని అందించబోతున్నారు.అయితే ఇలా యూకే నుంచి ఈ విధమైనటువంటి పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోగా చిరంజీవి నిలిచారు.ఈ విధంగా చిరంజీవికి మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారం రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో చిరు బిజీగా ఉన్నారు.







