నిరీక్షణకు తెర.. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా

అమెరికాలో భారత రాయబారిగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా( Vinay Kwatra ) నియమితులయ్యారు.ఈ మేరకు విదేశాంగ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

 Former Foreign Secretary Vinay Kwatra Named New Indian Ambassador To The U.s , V-TeluguStop.com

త్వరలోనే ఆయన విధుల్లో చేరుతారని ప్రభుత్వం తెలిపింది.గతంలో రాయబారిగా ఉన్న తరంజిత్ సింగ్ సంధు( Taranjit Singh Sandhu ) జనవరిలో పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో వినయ్‌ని నియమించారు.

ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను అంచనా వేయడం, కొత్తగా కొలువదీరబోయే ఫెడరల్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటం క్వాత్రా ముందున్న పెద్ద పని.

ఈ ఏడాది చివరిలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) వస్తారని భావిస్తున్నారు.సిఖ్ ఫర్ జస్టిస్ నేత, ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఇరుదేశాల మధ్య విభేదాలు, మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ సమావేశం, భారతదేశంలో మానవ హక్కుల స్ధితిపై అమెరికా వైఖరి తదితర అంశాలను వినయ్ క్వాత్రా చక్కబెట్టాల్సి ఉంది.

Telugu Indian Foreign, Delhi, Taranjitsingh, Joe Biden, Vinay Kwatra, Washington

అయితే తరంజిత్ రిటైర్మెంట్ తర్వాత అమెరికాలో కొత్త రాయబారి నియామకం ఆలస్యం అయ్యింది.దీంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని న్యూఢిల్లీ, వాషింగ్టన్‌లు ( New Delhi, Washington )కోరినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వినయ్ క్వాత్రా జూలై 15న కొత్త విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి బాధ్యతలు అప్పగించారు.ఆ వెంటనే అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా నియామకానికి వాషింగ్టన్ ఆమోదముద్ర వేసింది.

రెండు దశాబ్థాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ సర్వీస్‌లో ఉన్న అధికారిని కాకుండా సీనియర్ హోదాలో పదవీ విరమణ చేసిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ( Indian Foreign Service )అధికారిని రాయబారిగా నియమించాలని న్యూఢిల్లీ నిర్ణయించడం విశేషం.

Telugu Indian Foreign, Delhi, Taranjitsingh, Joe Biden, Vinay Kwatra, Washington

1980, 1990వ దశకాలలో చాలా వరకు ఢిల్లీ మాజీ మంత్రి, జమ్మూకాశ్మీర్ గవర్నర్ కరణ్ సింగ్.పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ సిద్ధార్ధ శంకర్ రే, మాజీ కేబినెట్ సెక్రటరీ నరేష్ చంద్రతో సహా పలువురు రాజకీయ నాయకులను అమెరికా రాయబారులుగా నియమించింది భారత్.2001లో పదవీ విరమణ చేసిన విదేశాంగ కార్యదర్శి లలిత్ మాన్ సింగ్‌ను అమెరికాలో భారత రాయబారిగా నియమించారు.అయితే 2004 నుంచి 2024 మధ్యకాలంలో వాషింగ్టన్‌లో రాయబారులుగా సేవలందించిన వారంతా ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులే కావడం గమనార్హం.

సౌత్ బ్లాక్‌లో క్వాత్రాకు ముందున్న హర్ష్ ష్రింగ్లా విదేశాంగ శాఖ కార్యదర్శి కాకముందు అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube