సినీ నటుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) జనసేన పార్టీ( Janasena Party ) ని స్థాపించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ పార్టీని తర్వాత పవన్ కళ్యాణ్ పలుసార్లు పోటీ చేసినప్పటికీ ఎక్కడ గెలవలేదు.
ఇక 2024 ఎన్నికలలో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో ఘనవిజయం సాధించింది దీంతో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే కావడమే కాకుండా మంత్రిగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చిన సంగతి తెలిసిందే.
జబర్దస్త్ కమెడియన్ల నుంచి మొదలుకొని సినిమా హీరోలు అలాగే ప్రొడ్యూసర్లు కూడా పిఠాపురంలో( Pithapuram ) పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.ఇక మరి కొంతమంది సెలబ్రిటీలు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పవన్ కళ్యాణ్ విజయానికి కారణమయ్యారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతమైన మెజారిటీతో గెలిచారు.ఇకపోతే తాజాగా బన్నీ వాసు (Bunny Vasu) ఓ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నుంచి తనకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ రావడం గురించి మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ తనకు 2019వ సంవత్సరంలోనే ఎమ్మెల్యేగా టికెట్ ఆఫర్ ఇచ్చారు కానీ నాకు అప్పుడు కాస్త భయం వేసి వెనకడుగు వేశాను కానీ నిర్మాత అల్లు అరవింద్ గారు మాత్రం 2029 వరకు గీత ఆర్ట్స్ బ్యానర్ ను బాగా సెట్ చేసి రాజకీయాలలోకి వెళ్లిపో అప్పుడు నీకు కావాల్సినంత సపోర్ట్, డబ్బు కూడ అందిస్తానని తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ 2024 లో కూడా తనకు ఆఫర్ ఇచ్చారు కానీ నేను అల్లు అరవింద్( Allu Aravind ) గారిని అడిగి చెబుతానని చెప్పాను దాంతో నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడే నన్ను కలువూ అంటూ చెప్పారని ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ గురించి బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.