ప్లానింగ్ లో ప్రభాస్ ను మించిన హీరో లేడుగా.. ఈ హీరోకు ఎవరూ సాటిరారుగా!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో( Kalki Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 New And Upcoming Movies Of Prabhas, Prabhas, Upcoming Movie, Plan, Tollywood-TeluguStop.com

ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్.ప్రస్తుతం ఇటలీలో ఉన్న ప్రభాస్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన తదుపరి సినిమాల విషయాల గురించి ఆలోచిస్తున్నారు.ప్రభాస్ రాక కోసం దర్శకుడు మారుతి వెయిట్ చేస్తున్నాడు.

ప్రభాస్ రాగానే రాజా సాబ్ ( Raja Saab )కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నాడు.

Telugu Prabhas, Tollywood-Movie

ఇక ప్రభాస్ ( Prabhas )తదుపరి చెయ్యబోయే చిత్రంపై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొన్న విషయం తెలిసిందే.అంటే ప్రభాస్ లైనప్ లో సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్, హను రాఘవపూడి మూవీస్ ఉన్నాయి.ఇందులో రాజా సాబ్ చిత్రాన్ని ప్రభాస్ త్వరగా పూర్తి చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది.ప్రభాస్ తదుపరి చెయ్యబోయే చిత్రం పైనే అందరిలో ఆసక్తి మొదలైంది.

అంటే సలార్ 2 సెట్స్ మీదకి వెళ్లాలంటే ప్రశాంత్ నీల్ ఫ్రీ అవ్వాలి.ఇక ప్రభాస్ లైనప్ లో స్పిరిట్ మొదలు కావాల్సి ఉండగా ప్రభాస్ మాత్రం ముందుగా లవ్ స్టోరీ అయిన హను రాఘవపూడి ( Hanu Raghavapudi )సినిమాని త్వరగా కంప్లీట్ చెయ్యాలని అనుకుంటున్నట్లుగా టాక్.

Telugu Prabhas, Tollywood-Movie

ప్ర‌భాస్ ముందుగా సందీప్ వంగతో ( Sandeep Vanga )స్పిరిట్ సినిమానే స్టార్ట్ చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ ఆ సినిమా ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు మ‌రింత స‌మ‌యం ప‌డుతుండ‌టంతో, ప్ర‌భాస్ ముందుగా హను రాఘ‌వ‌పూడితో సినిమాను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించినట్లుగా తెలుస్తోంది.మరి దీనిని బట్టి ప్రభాస్ ప్లానింగ్ మాములుగా లేదుగా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.సినిమా విషయంలో ప్లానింగ్ విషయంలో ప్రభాస్ ను మించిన హీరో లేడుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube