టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Power Star Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా చివరగా రామ్ చరణ్ రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో పాటు కోట్లల్లో కలెక్షన్స్ ని సాధించింది.
ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు చెర్రీ.

ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో( game changer movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.అయితే ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే.తాజాగా రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది.అదేమిటంటే ఆగస్ట్ లో 15వ వార్షిక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్( Indian Film Festival of Melbourne ) లో పాల్గొననున్నారు రామ్ చరణ్.

ఈ కార్యక్రమానికి A.R రెహమాన్, కరణ్ జోహన్, రాజ్ కుమార్ హిరానీ, ఇంతియాజ్ అలీ, కబీర్ ఖాన్ వంటి దర్శకులు, నిర్మాతలు కూడా హాజరు కానున్నారు.అయితే హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే ఉండటం విశేషం.అయితే రామ్ చరణ్ కు ఇలా మరో అరుదైన ఘనత దక్కడంతో ఈ క్రెడిట్ అంతా కూడా క్లీంకార అదే తన పుట్టిన తర్వాతనే మెగా ఇంట్లో ఇలా ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు చెర్రీ అభిమానులు.
ఆ చిట్టి తల్లి పుట్టిన తర్వాత అంతా శుభమే జరుగుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇకపోతే హీరో రామ్ చరణ్ విషయానికి వస్తే.చెర్రీ బుచ్చిబాబు సనా, సుకుమార్ లతో సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాల పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.